Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 14th august to 20th august

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

తిక్క : కృష్ణ కిషోర్ వల్లూరి గారూ మీకు నమస్కారం పెడితే ఎవరికి వెళుతుంది?

తొక్క: డైరెక్ట్ గా నా కార్టూన్ గురువులకి వెళుతుంది .
 
తిక్క : పొగరుతో కార్టూన్లేస్తే పొగ వస్తుందా?
 
తొక్క: వస్తుంది.. పత్రిక ఆఫీసులోని చెత్త కుండీలోంచి.
 
తిక్క : మీ కార్టూన్లతో ఒబామా ఆడుకుంటాడా?
 
తొక్క: చిన్నప్పుడు ఆడుకునేవాడు.. ప్రెసిడెంట్ ఉద్యోగం వచ్చాక మానేశాడు లెండి. .
 
తిక్క : కృష్ణ కిషోర్ వల్లూరి అనే పేరుతోనే కార్టూన్లెందుకు వేస్తున్నారు?
 
తొక్క: పక్కోడి పేరుతో వేస్తే బాగుండదు కదాని ..
 
తిక్క : మోడీ నుంచి కార్టూన్లు కొనుక్కుని, సచిన్ టెండూల్కర్ పేరుతో ఎందుకు రిలీజ్ చెయ్యలేదు మీరు?
 
తొక్క: మోడీ ఈ మధ్య కార్టూన్ల బిజినెస్ మానేసి ప్రధానమంత్రి ఉద్యోగం చేసుకుంటున్నాడు.. ఏం చేస్తాం ..
 
తిక్క : కార్టూన్లు వేయాలన్న ఆలోచన మీకెందుకు కలగలేదు?
 
తొక్క: అనవసరంగా ఆలోచించాల్సోస్తుందని ..
 
తిక్క : మీది తుంటర్వ్యూ కాదా?
 
తొక్క: హన్నా! .ఎవడన్నాడు కాదని ?. . ఖచ్చితంగా ఇది నాలోని "తుంటరి "వ్యూ " .
 
తిక్క : కార్టూన్లు పోవడానికి మీరు సోనామసూరి సబ్బుతో పళ్ళు తోముకుంటారా?
 
తొక్క: కాదు..అప్సర eraser తో తోముకుంటా ..
 
తిక్క : సొరకాయ సోయగాలు, కోమలాంగుల లేత కొమ్ములు మీ కార్టూన్లకెందుకు పనికిరావు?
 
తొక్క: వాటిని కవులు ఆల్రెడీ వాడేసారు.. ఒకరు వాడినవి నేను వాడను .
 
తిక్క : మీ కార్టూన్ల ప్రభావంతో పండగలతేదీలు మారిపోతే వెంటనే కార్టూన్లేస్తారా?
 
తొక్క: ఆ పండగల్ని ఆదివారం నుంచి తప్పించటం కోసం వేస్తా.. అప్పుడు ఆఫీసుకి పండగ సెలవొస్తుంది కదా ..
 
తిక్క : ఒక్కరోజైనా దినపత్రికలన్నీ విడుదల కాకుండా ఆపి, మీ కార్టూన్లెందుకు ఇంటింటికీ పంచే ప్రయత్నం చేయరు మీరు?
 
తొక్క: నా కార్టూన్ల దెబ్బకి దినపత్రికలు మూత పడిపోతే ,రాజకీయ పార్టీల గురించి డబ్బా ఎవరు కొడతారు చెప్పండి .
 
తిక్క : సాగరసంగమం సినిమా వచ్చేనాటికి మీరు కార్టూన్లు స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా?
 
తొక్క: అవును. .కార్టూన్లు స్టార్ట్ చేయకుండా ఉంటే సాగరసంగమం ఇన్స్పిరేషన్ తో డాన్సు మాస్టర్ అయ్యేవాడిని .. ప్చ్ ..ఏంచేస్తాం ..కార్టూనిస్ట్ అయ్యా ..
 
తిక్క : అడవిలో మీ కార్టూన్లు ఎక్కడ దొరుకుతాయి?
 
తొక్క: నరికేసిన చెట్ల దగ్గర ..
 
తిక్క : దుస్యోధనుడు మీ కార్టూన్లు చూసే బలవంతుడయ్యాడని ఎవరు ఎవరితో ఎక్కడ ఎప్పుడు చెప్పారు?
 
తొక్క: హనుమాన్ వ్యాయామశాలలో కోచ్ హనుమంతు చెప్పాడు , భీముడు సైక్లింగ్ చేస్తూండగా అర్జునుడితో . .. 
 
తిక్క : గట్టిగా అరుస్తూ కార్టూన్లేస్తే అరబ్ దేశాలకు వినిపిస్తాయా?
 
తొక్క: మా ఆవిడకి వినిపిస్తుంది.. వెంటనే పిలుస్తుంది మూలశంక చెక్ చేయటానికి డాక్టర్ని ..
 
తిక్క : చాలావరకు అంతర్జాతీయ బహుమతులు ఎందుకు వదిలేస్తున్నారు?
 
తొక్క: నేను వదలట్లే.. వాళ్ళే ఇవ్వట్లే.!!
 
తిక్క : మీరు ప్రశ్నిస్తున్నారా, కార్టూన్లేస్తున్నారా?
 
తొక్క: కార్టూన్లతో ప్రశ్నిస్తున్నా..
 
తిక్క : అక్షరాలతో ఆటలాడుకోకుండా ఉంటారా?
 
తొక్క: ఎలా ఉండగలను .. "పిట్ట వేసింది రెట్ట - అదో సువాసనల తుట్ట " లాంటి తెలుగు పదాక్షర ఆటల్లో దిట్టని కదా..
 
తిక్క : మీ కార్టూన్లకంటే ముందు ఎవరు మేల్కొంటారు?
 
తొక్క: నాలో నిద్రపోతున్న సీనియర్ కార్టూనిస్టులు .
 
తిక్క : అత్యధిక వర్షపాతం లేని సందర్భంలో మీ కార్టూన్లు ఎవరికి లాభం?
 
తొక్క: రైతులకి . .
 
తిక్క : తుంటర్వ్యూకి కొశ్చెన్లెప్పుడు వేస్తారు?
 
తొక్క: పిచ్చి raising లో ఉన్నప్పుడు .
 
తిక్క : తుంటర్వ్యూ మొదట్లోనే అయిపోయిందికదా, ఎవరికైనా సారీ చెప్తారా?
 
తొక్క: నా జీవితం లో ఎవ్వరికీ సారీ చెప్పలే . ..కావాలంటే క్షమించమని అడుగుతా . హి ..హి.. హి ..
మరిన్ని శీర్షికలు
adi sankaracharyulu