Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rocket

ఈ సంచికలో >> సినిమా >>

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రవితేజ?

raviteja act in harish shankar
'బెంగాల్‌ టైగర్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ కాంబినేషన్లో నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన 'స్పెషల్‌ చబ్బీస్‌' సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ కానుందట. ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేసే రైట్స్‌ను ప్రముఖ కోలీవుడ్‌ దర్శక, నిర్మాత త్యాగరాజన్‌ తీసుకోగా, తెలుగులో ఆ రైట్స్‌ను హరీష్‌ శంకర్‌ చేజిక్కించుకున్నాడట. ఈ సినిమాకు హరీష్‌ శంకర్‌, రవితేజను హీరోగా సెలెక్ట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు డైరెక్టర్‌ త్వరలో తెలియజేస్తారు. ప్రసుతం రవితేజ ఇటీవలే విడుదలైన 'కిక్‌ 2' ఆశించినంత విజయం అందవ్వకపోవడంతో తర్వాతి సినిమా 'బెంగాల్‌ టైగర్‌' మీద కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జంటగా రాశీ ఖన్నా నటిస్తోంది. రవితేజతో హరీష్‌ శంకర్‌

ఇప్పటికి రెండు సినిమాలు చేశాడు. అందులో మొదటిది 'షాక్‌' అయితే రెండోది 'మిరపకాయ్‌'. వీటిల్లో 'మిరపకాయ్‌' సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. రవితేజతో మూడో సినిమాని కూడా సూపర్‌ సక్సెస్‌ చేయాలనే కసితో ఉన్నాడట దర్శకుడు హరీష్‌. ఇంకో వైపున సాయిధరమ్‌తేజతో హరీష్‌ చేస్తున్న 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 
మరిన్ని సినిమా కబుర్లు
namdamoori