Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
thrishanku swargam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఒకరికొకరు - లాస్య రామకృష్ణ

gaps due to shifts between couples

షిఫ్ట్ వర్క్స్ భార్యా భర్తల మధ్య గ్యాప్ ని సృష్టించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
ఒకప్పటిలా, ఉదయం 9 గంటలకి ఆఫీసుకి బయలుదేరితే సాయంత్రం 6 గంటలకి పని ముగించుకుని ఇంటికి చేరే రోజులు కావివి. వేరు వేరు షిఫ్టుల లో పని చేసే రోజులివి.

భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ సంసారాన్ని నడపవలసిన ఈ రోజులలో ఈ షిఫ్ట్ టైమింగ్ ల కారణంగా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకునే అవకాశం ఎక్కువగా ఉండట్లేదు. భార్యా భర్తల మధ్య ఈ షిఫ్ట్ టైమింగ్ లు కనబడని గ్యాప్ ని సృష్టించే అవకాశం ఉంది.

అందువల్ల ఈ గ్యాప్ ని అధిగమించి ఆనందంగా ఉండాలంటే ఇద్దరూ కొన్ని చిట్కాలని పాటించాలి.

1. ఫోన్ చెయ్యండి - సమయం చిక్కినప్పుడల్లా మీ భాగస్వామికి ఫోన్ చెయ్యండి లేదా మెస్సేజ్ పెట్టండి. సరదాగా అనిపించే కొటేషన్స్ గాని ఏవైనా జోక్స్ గాని పంపించండి. తరచుగా 'నాకు నువ్వే గుర్తోస్తున్నావు' లాంటి వాక్యాల వాడకం వల్ల మీ భాగస్వామి నుండి మీకు కలిగే ప్రోత్సాహం మీరే గమనిస్తారు. అనుక్షణం మీరు మీ భాగస్వామి గురించే అలోచిస్తున్నారన్న ఆలోచన వారిలోని సంతోషాన్ని కలిగించడమే కాకుండా వారికి భద్రతా భావాన్ని కూడా కలిగిస్తుంది.

2. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి -  మీరు ఎంత సేపు కలిసి సమయం గడిపారు అన్నదానికన్నా ఎంత ఉపయోగకరంగా గడిపారు అన్నదే ముఖ్యం. కలిసి ఉన్న కొద్ది సేపు కీచులాటలు లేదా ఏవో ఆర్గ్యుమెంట్ లతో సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కడికైనా సడెన్ డిన్నర్ ప్లాన్ చేసి రొమాంటిక్ గా గడపడం లేదా ఏదైనా సర్ప్రైజ్ తో మీ భాగస్వామికి సంతోషాన్ని కలిగించడం చెయ్యండి. మీరు కలిసి గడిపేది కొద్ది సమయమే అయినా ఆనందంగా గడిపితే తద్వారా లభించే ఫలితం మళ్ళీ మీకు సమయం చిక్కేంత వరకు గుర్తుండిపోతుంది.

3. ట్రీట్ ఇవ్వండి - ట్రీట్ ఇవ్వడానికి పెద్దగా కారణాలు అవసరం లేవు. అలాగే ట్రీట్ అంటే ఏదైనా కాస్ట్లీ రెస్టారంట్లోనే ఇవ్వాలన్న రూల్ కూడా లేదు. మీ భాగస్వామికి ఆఫీసు లో ఏవైనా ప్రసంశలు వచ్చినా మీరు ట్రీట్ ఇవ్వవచ్చు. చక్కటి డైరీ మిల్క్ చాక్లెట్ తో పాటు అందంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డు చేసే మాయ అంతో ఇంతో కాదు. వారు సాధించే ప్రతి చిన్న విషయం కూడా మీకు పెద్ద విషయమని తెలుసుకుని వారు అమితంగా సంతోషిస్తారు. వారికి నచ్చిన వస్తువుని ఏదైనా ముందుగానే కొని సర్ప్రైజ్ కూడా ఇవ్వవచ్చు.

4. ఆఫీసు విషయాలు ఎక్కువగా మాట్లాడకండి - మీరు కలిసే కొద్ది సమయం లో లక్షా తొంభై విషయాలు మాట్లాడటం వల్ల మీ ఇద్దరి గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఆఫీసు విషయాలు మీ భాగస్వామి తో చర్చించడానికి కూడా ప్రత్యేకించి సమయం పెట్టుకోండి. మీరిద్దరూ ఏకాంతంగా గడిపే సమయం లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోండి. ఇద్దరికీ సంబంధించిన సరదా సంఘటనలు జ్ఞాపకం తెచ్చుకుని పంచుకోండి.

5. మళ్ళీ హనీమూన్ కి వెళ్ళండి - సరదాగా ఇద్దరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లిరండి. ఈ గజిబిజి జీవన విధానం లో నుండి అందులోనీ ఈ షిఫ్ట్ ఉద్యోగాల నుండి దూరంగా కొన్ని రోజులు హాయిగా మీరు మీ భాగస్వామి తో కలిసి చక్కటి హనీమూన్ ని ప్లాన్ చేసుకోండి.

భార్యభర్తలకి ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమకి షిఫ్ట్ వర్క్స్ అగాధంగా నిలువకూడదు. ఇవి పాటించి మీ ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదించండి. 

మరిన్ని శీర్షికలు
challenge mini story by AVM