Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Home Remedies

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

లెఫ్ట్ అండ్ రైట్

అడుగడుగునా రహదార్లు ఛిద్రం... 
ట్రాఫిక్ పద్ధతులు అస్తవ్యస్తం!

నిబంధనలు పట్టని వాహన చోదకులు...
కఠిన విధానాలకు నీళ్లోదిలిన పాలకులు!! 


జవాబు లేని ప్రశ్న

జవాబుదారీ తనం లేని వ్యవస్థలో...
అడుగడుగునా అవస్థలు!

నవాబుదొరలే నయమనిపించెలా...
నేటి నాయకుల తీరు ఉంటే ఎలా?


 

సీటే స్వీటు

జంపు జిలానీల హడావుడీ...
ముంచుకొచ్చే ఎన్నికలకు రెడీ!

సిద్ధాంతాలా పాడా? సీటివ్వకపోతే తేడా!
ఆదర్శాలకు నిలిచే వాడెవడూ లేడా?

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu