Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

చిక్క రాయుడు: మన రాయల వారు ఏ పార్టీ?
తిక్క రాయుడు: 'దేశంబు తెలుగు' అని ఆయనే చెప్పుకున్నారుగా.

సత్యభామ: ఈ పద్మంలో రెండు దళాలు  కనిపించుట లేదక్కా!?
రుక్మిణి: 'నల్లని వాడు, పద్మ నయనమ్ములవాడు', ఆయన్నే అడుగుదాం పద!! కళ్ళకంటిచుకున్నారేమో!!

పెద్ద గురుడు: సకల విద్యలు నేర్చి, అదృశ్య రూపం దాల్చావా? ఏదీ చూపించు?
చిన్నగురుడు: నీ నెత్తి మీదే కూర్చుని వున్నాను పెద్ద గురూజీ!

మొదటి కాపలాదారుడు: రేయ్  ఆ కాగాడాలని దూరంగా జరుపు!
రెండవ కాపలాదారుడు: ఎందుకో 
మొదటి కాపలాదారుడు: కర్పూర వసంతరాయల వారు ఇటువేపు వస్తూన్నార్రా, వెధవా!!

కవిశేఖరుడు: నేను రచించిన ఈ కావ్యాన్ని ఛస్తే రాజుగారికి అంకితమివ్వను. నా ప్రాణం పోయినా సరే...!
రాజభటులు, రాజు గారి కొలువులో: మహా ప్రభో, ఆ కవిశేఖరుడు తన కావ్యాన్ని తమరికి అంకిత మివ్వడట ప్రభో!!
రాజు: ఆ... ఎంత కండ కావరం? వాడ్ని పట్టి ఈడ్చుకు రండి. నాకెందుకు అంకితమివ్వడో నేనూ చూస్తాను. పొండు!
ఆ వార్త విన్న కవిశేఖరుడు, తన పెళ్ళాంతో: ఏవోయ్.. మన అదృష్టం పండింది. రాజు గారి నుండి ఆహ్వానం వచ్చింది! నా కావ్యాన్ని స్వీకరించడానికి రాజు గారు అంగీకరించారు!
పెళ్ళాం: నా కన్నీ తెలుసు లెండి! ఎట్లాగయితేనేం.. సాధించారు! రాజ దర్బారులో, దెబ్బలు తినకుండా చూసుకోండి!

రాక్షస మాత: ఏరా అబ్బాయ్.. నీ ఒళ్లంతా చూడు.. పాము కోరల గాట్లు.. ఛీ.. ఛీ.
రాక్షసుడు:  ఛీ కొట్టకమ్మా.. సాగర మథనం గాలించి వొస్తున్నాను!!


కింకరుడు - 1: ఈ పాపి కొంత పుణ్యం చేసాడా?
కింకరుడు - 2: అందు చేతనే వీడిని నూనెలో వేయించకుండా, నీటిలో ఉడకపెట్టమని ఏలిక వారి ఆజ్ఞ!

పార్వతి: భక్తులు మీకు క్షీరాభిషేకం చేశారు గదా? వారికి మీరేం కటాక్షించారు?
శివుడు: నీరు సమృద్ధిగా లభించాలని కటాక్షించాను.  
పార్వతి: క్షీరాభిషేకం చేశారు, భక్తులకి క్షీరం సమృద్ధిగా కదా మీరు ప్రసాదించాల్సింది? నీటిని కటాక్షించారే?
శివుడు: ఆ అభిషేక క్షీరంలో, నీళ్ళేక్కువున్నాయిలే!!

ప్రేయసి: నేను గర్భందాల్చాను , శిశువు, తండ్రివి నీవే!
ప్రియుడు: నేను కాను, మరెవరో.  ఇంతకీ... ఇది ఏ  కోవెల సన్నిధి!    
ప్రేయసి: శ్రీ కాణిపాక వరసిద్ధి  కోవెల సన్నిధి!
ప్రియుడు: చచ్చాను.. శిశువు తండ్రిని నేనే.. పద పెళ్లి చేసుకుందాం!!   

వరుణ దేవుడు:  ఖాండవ వనం దహించావు, ఆకలి తీరిందా?
అగ్ని దేవుడు : ఆకలి తీరింది గానీ, విరోచనాలు ప్రారంభమయ్యాయి!
వరుణ దేవుడు: అరె.. ఎందుకూ?
అగ్ని దేవుడు : ఆ వనంలో రెండు మూడు ఆముదపు చెట్లు తగలడ్డాయి!! హు!
మరిన్ని శీర్షికలు
mulakkaya royyalu recipe