Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gaps due to shifts between couples

ఈ సంచికలో >> శీర్షికలు >>

'ఛాలెంజ్' పిట్ట కథ - ఎ వి ఎమ్

challenge mini story by AVM

ఉత్తరాఖండ్ బాధితులను చూసి చలించిపోయారు ఓ మంత్రి గారు.

వెంటనే జ్యోతిష్య సామ్రాట్ ని పిలిపించారు.

కుశల ప్రశ్నల తరువాత...

"మీరు సూర్యుడి గమనాన్ని చెప్పగలరు...!"

'అవును'

"చంద్రుడి కళలను చెప్పగలరు...!"

'నిజమే'

"కుజగ్రహం లో ఏమేమి వున్నాయో..!"

'చెప్పాము గదా!'

"బుద్ధ గ్రహం చిన్నదనీ, గురు గ్రహం పెద్దదనీ...!"

'అవన్నీ మా పూర్వీకులు ఏనాడో చెప్పారు గదా'

"శుక్రుడి వాళ్ళ కళల అభివృధ్ధి అనీ ...!"

'హండ్రెడ్ పర్సెంట్ నిజం!'

"ఇంకా శని వల్ల కష్టాలనీ.. రాహు కేతువుల వల్ల గ్రహణం వస్తుందనీ... !"

'నిస్సందేహంగా..!'

"అదొక్కటీ అంటే...  మొన్న ఉత్తరాఖండ్ లో వరదలు వస్తాయని ముందుగా చెబితే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు కదా!" అన్నారు మంత్రి గారు వెకిలిగా.

పళ్ళ బిగువున కోపాన్ని బిగపట్టారు సిద్ధాంతి గారు.

'చెప్పగలను! మీరు ఒక పని చేయ గలిగితే'

"ఏం చెయ్యాలో చెప్పండి.. తక్షణం చేస్తా!"

'నన్ను వేరే గ్రహానికి తీసుకెళ్ళండి! నేను భూమి మీద వుండి అన్నీ గ్రహాల సంగతులు చెబుతున్నా గదా... అలాగే... అక్కడి నుండి భూమిపై జరిగే అన్ని విషయాలు చెబుతా!!'

మంత్రి గారు, వంధి మాగదుల నోటికి తాళాలు పడ్డాయి.

మరిన్ని శీర్షికలు
Home Remedies