Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Paryatakam - Mysore

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జూలై 06 నుండి జూలై 12) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మిశ్రమఫలితాలను ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. మిత్రుల నుండి సహకారంను పొందుటకు అవకాశాలు కలవు. సంతానమూలక సౌఖ్యంను కలిగి ఉంటారు.  వారితో సమయాన్ని గడుపుతారు. వారం ఆరంభంలో మీమాటతీరు వలన స్వల్ప ఇబ్బందులను పొందినను తర్వాత చిన్న చిన్న మార్పులతో అందరిని కలుపుకొని వెళ్ళుటకు అవకాశం కలదు. ఉత్సాహంతో పనులను చేపడుతారు అలాగే పనిఒత్తిడి కారణంగా హృదయాందోళనను కలిగి ఉంటారు. మీకు అననుకూలమైన వార్తను వినడం చేత స్వల్పంగా బాధను పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలువడం వారియొక్క ప్రేరణ చేత పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశాలు కలవు. ఆర్థికపరమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెద్దల వలన నూతన అవకాశాలు కలుగుతాయి వారి ఆలోచనలను అమలు చేయుట మూలాన లాభం ఉంటుంది. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా ఉండుట ఉత్తమం.        

వృషభ రాశి
ఈవారం కొన్ని విషయాల్లో నిదానంగా వ్యహరించుట అన్నివిధాల మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా ఉండుట అలాగే నిర్ణయాలు తీసుకొనే ముందు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. ఉత్సాహంతో పనులను చేపడుతారు. ఇతరుల సహకరం అందుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆలోచనలు అధికమయ్యే అవకాశం కలదు, నియంత్రణ అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా ఇబ్బందులు తొలగుతాయి. బాగానే ఉంటుంది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు, కాకపోతే జాగ్రత్తగా అమలుచేయుటకు ప్రణాళిక అవసరం. సమాజంలో మీ ఆలోచనల మూలాన కీర్తిని పొందుటకు అవకాశం కలదు, కాకపోతే మీ వ్యతిరేకవర్గం నుండి మాత్రం ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మంచిది. బంధుమిత్రులతో సరదాగా విందులలో పాల్గొను అవకాశం కలదు. మాటను కూడా కొన్నిసార్లు పొదుపుగా వాడుట మంచిది అందరిని కలుపుకొని వెళ్ళండి.       

మిథున రాశి
ఈవారం మీరు చేబట్టే పనులపైన సరైన దృష్టిని పెట్టుట మంచిది. వారం ఆరంభంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చేసేపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో మీరు అధికమైన ఖర్చును పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట సూచన. మృష్టాన్నభోజన ప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్దిని పొందుతారు. ఖర్చులను నియత్రించుట అవసరం లేకపోతే మనోవిచారంను పొందుటకు అవకాశం కలదు. నూతనవస్త్ర లాభంను పొందుతారు నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వాహనములు నడుపునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టండి. ప్రమాదాలు కలుగుటకు అవకాశం కలదు. నూతన ఆర్థిక ఆలోచనలను కలిగి ఉంటారు. కొద్దిగా శ్రమను పొందుట ద్వార లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో నిదానంగా ఉండుట ఉత్తమం. ఒకవార్త మిమ్మల్ని భాధకు గురిచేయవచ్చును సర్దుకుపొండి. 

కర్కాటక రాశి
ఈవారం పెద్దల సూచనలను పాటించుట వలన మంచి జరుగుతుంది. వారం ఆరంభంలో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుతారు వారితో నూతన ఆలోచనాలు చేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు అనుకూలించకపోవచ్చును. వీలైతే ప్రయాణం వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశాలు ఉన్నవి జాగ్రత్తగా ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోనివిధంగా ఖర్చును పొందుటకు అవకాశం కలదు. అందరిలోను ఉన్నప్పుడు మాటలను జాగ్రత్తగా వాడుట మంచిది లేకపోతే కలహములు కలుగుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి. సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ప్రయత్నాలు నిదానంగా సానుకూలపడుతాయి. నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. వేరేప్రదేశంలో పనిచేయవలసి రావోచ్చును. స్వల్ప ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో చిన్న చిన్న మార్పులు కలుగుటకు అవకాశం కలదు, స్వాగతించుట ఉత్తమం.   

సింహ రాశి
ఈవారం ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. అధికారులకు అనుగుణమైన ఆలోచనలను చేయుట మూలాన వారికి దగ్గర అవుతారు. లాభంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని కలిగి ఉంటారు. నూతన ఆలోచనలు అనుకూలిస్తాయి. మంచిపనులను చేపట్టుట వలన పేరును కలిగి ఉంటారు. మీ వలన తోటివారు లాభంను పొందుటకు అవకాశం ఉంది. బుద్ధిబలం చేత క్లిష్టమైన పనులను పూర్తిచేస్తారు. సమయానికి పనులను పూర్తిచేయుట మూలాన లబ్ది ఉంటుంది. బంధువులతో నూతన పనులను చేపడుతారు. పనులు ముందుకు సాగుతాయి. కుటుంబంలో శుభకార్యములు జరుగుటకు అవకాశం కలదు. సమయాన్ని సంతోషంగా గడుపుతారు. విందులలో పాల్గొంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో అధికంగా ఆలోచించుట మూలాన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఇష్టమైన వారిని కలుస్తారు వారి ద్వార కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది.      

కన్యా రాశి
ఈవారం చేపట్టే పనులలో నిదానంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. నూతన నిర్ణయాలు చేయునపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. కొత్త ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చును కావున గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట మంచిది. వారం ఆరంభంలో కుటుంబంలో స్వల్ప సమస్యలు కలుగుటకు అవకాశం కలదు సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచి చేస్తుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి కావున కష్టించి పనిచేయుట మూలాన అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట అలాగే అవతలివారి వాదనను పరిశీలించుట మంచిది. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. బంధువులతో లేదా మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కొన్ని విషయాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసలుబాటు ఉండటం చేత సంతోషాన్ని పొందుతారు.   

తులా రాశి
ఈవారం మీరు చేపట్టిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పెద్దల సహకారంతో చేపట్టిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజన సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. పనులు నిదానంగా ముందుకు వెళ్ళుటకు ఆవకాశం కలదు. కొత్త పనులను చేపట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేపట్టుట ఉత్తమం. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. కుటుంబంలో సర్దుబాటుగా ఉండటం చేత ఇబ్బందులు తగ్గుటకు అవకాశం కలదు. మీయొక్క వ్యతిరేకుల మూలాన సమస్యలను కలిగి ఉంటారు. జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవడం వలన సమస్యలు తగ్గుతాయి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత మానసికంగా భాదను కలిగి ఉంటారు. స్థానచలనంనకు అవకాశం కలదు ప్రతి విషయంలోను ఆచితూచి స్పందించుట అవసరం. 

వృశ్చిక రాశి
ఈవారం ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వారితో నచ్చిన పనులను చేపడుతారు. ఆరంభంలో చేపట్టిన పనుల మూలాన అందరిలోను గుర్తింపును కలిగి ఉంటారు. అనారోగ్యం విషయంలో అశ్రద్ద కూడదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. జాగ్రత్తగా ప్రారంభించుట మంచిది. అధికమైన శ్రమను కలిగి ఉంటారు. అనుకోని ఖర్చులను పొందుట వలన బాధను కలిగి ఉంటారు. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు మానసిక సంఘర్షణను కలిగించేవిగా ఉండుటకు ఆస్కారం కలదు. ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు చేయుట మూలాన ఖర్చులను అలాగే ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట అలాగే అకారణంగా వచ్చే కలహములకు దూరంగా ఉండుట సూచన. మీ మాటలు కొంత అనుమానస్పదంగా ఉండే అవకాశం కలదు. గురువుల యెడల భక్తిని కలిగి ఉండుట వారి ఆలోచనలను పాటించుట ఉత్తమం.   

ధనస్సు రాశి
ఈవారం కుటుంబంలో సంతోషంగా సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. నూతనఆలోచనలు కలిగి ఉండి ఉత్సాహంతో పనులను ఆరంభిస్తారు. వారం మధ్యలో అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులను పొందుతారు జాగ్రత్తగా ఉండుటం మంచిది. కుటుంబంలో నూతన ఆలోచనలు చేయుటకు ముందు అందరిని సంప్రదించుట ఉత్తమం. మీ ఆలోచనలు సమాజంలో గుర్తింపును కలిగించేవిగా ఉంటవి. అనుకోనివార్తను వినుట మూలాన కొంత బాధను పొందుటకు అవకాశం కలదు మానసికంగా ధృడంగా ఉండుట మంచిది. అనుకోని ఖర్చులను పొందుతారు. విందులు వినోదాలలో పాల్గొనే అవకాశం కలదు. నూతన వస్తువులను కొనే అవకాశం కలదు. ధార్మికసంబంధ పనులకు సమయాన్ని కేటాయించుట ఉత్తమం. అధికారులతో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు. కావున నిదానంగా వ్యవహరించట మేలుచేస్తుంది. మిత్రుల ద్వారా నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు. 

మకర రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం కలదు. ధనలాభంను పొందుటకు అవకాశం ఉంది. అన్నిపనులను చేపట్టాలనే ఉత్సాహంను కాకుండా చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ప్రయత్నించుట మంచిది. అశుభవార్తను వినే అవకాశం కలదు. కుటుంబం లోని ఒకరి అనారోగ్యం మిమ్మల్ని ఒకింత భాధకు గురిచేసే అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు పాటించుట అలాగే నిదానంగా వ్యవహరించుట మంచిది. వినోదములలో పాల్గొనేందుకు అవకాశం కలదు. అలాగే ఆసక్తిని కలిగి ఉంటారు. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. అధికారుల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. వారితో జాగ్రత్తగా ఉండుట సూచన. కోపంను కలిగి ఉంటారు. ఇతరుల మీద ప్రయోగించకండి. కోపం మూలాన నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మంచిది. ఉద్యోగంలో శ్రమను కలిగి ఉంటారు.   

కుంభ రాశి
ఈవారం మీరు ఉద్యోగంలో మంచి పేరును కలిగి ఉంటారు అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. దూరప్రదేశ వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులతో,మిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం కలదు. బంధువులతో చేపట్టిన పనులలో జాగ్రత్తగా ఉండుట మంచిది లేకపోతే అధికమైన ఖర్చును పొందుటకు అవకాశం కలదు. ఆలోచనల్లో కొంత కన్ఫ్యూషన్ కలిగి ఉండే అవకాశం కలదు. వారం ఆరంభంలో నచ్చని వార్తను వినడం మూలాన ఆందోళనను పొందుతారు. మీరు చేపట్టిన పనుల మూలాన వారం చివరలో గుర్తింపు పొందుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల జాగ్రత్తగా ఉండుట సూచన. చేపట్టే పనులలో అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. కుటుంబంలో మీ జీవితభాగస్వామితో కొంత ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది.

మీన రాశి
ఈవారం ఉత్సాహంతో పనులను చేపడుతారు నచ్చిన విషయాల్లో పాల్గొనేందుకు ఇష్టపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు ధనలాభంను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. చేయు పనిలో అధికమైన శ్రద్ధను చూపడం ఉత్తమం. బంధువులతో మీయొక్క ఆలోచనను పంచుకుంటారు. వారం మధ్యలో అధికమైన ఆలోచనలను కలిగి ఉండుట చేత భాదను పొందుతారు. ఒక వార్త మీలో నిరుత్సాహంను పెంచుతుంది. కుటుంబంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన కొంత లాభంను పొందుటకు అవకాశం కలదు. అనుకోకుండా కలహములు కలుగుటకు అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. స్థానచలనం ఉంటుంది కొంత వేచిచూడడం ఉత్తమం. ఖర్చును తగ్గించుకొనే ప్రయత్నం చేయుట కలిసి వస్తుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుతారు.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
travelogue eastren europe book review