Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
challenge mini story by AVM

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిట్కా వైద్యం - సూర్య నళిని

Home Remedies

సాధారణంగా మానవుల  దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ అనారోగ్యం సంభవించటం సహజం. కొన్ని వయస్సుతో, మరికొన్ని వాతావరణ మార్పులకి మరికొన్ని వారి వారి జీవన శైలిని బట్టి అనారోగ్యం పాలవ్వటం జరుగుతూవుంటుంది.

అలా కొన్ని చిన్న చిన్న నొప్పులకి డాక్టర్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉపశమనం పొందటానికి కొన్ని చిట్కాలు:

1) పళ్ళు తీపులు పుట్టినప్పుడు జామాకులు లేదా దురదగుంట ఆకులు నలిపి పంటి కింద పెడితే కొంచం ఉపశమనం గా ఉంటుంది. 
2) మనం చేసే ప్రతి వంటకములో జీలకర్ర పొడిని వేస్తే అరుగుదల బాగుంటుంది.
3) మడమలు నొప్పిగా ఉన్నప్పుడు ఆముదముని మడములకు రాసి  ఇటుకలను కాల్చి కాపడము పెడితే నెప్పులు తగ్గుతాయి. 
4) తల నెప్పిగా ఉన్నప్పుడు మిరియాలు అరగదీసి తలకు పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది.
5) జలుబు చేసి, శ్వాస కష్టంగా ఉన్నప్పుడు కర్పూరం, బియ్యం   కలిపి వాసన చూస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది.
6) దగ్గు బాగా ఉన్నప్పుడు కరక్కాయ ముక్కని చప్పరిస్తే దగ్గు తగ్గుతుంది.
7) ఆవాలు, వాము కలిపి మూకుడులో వేసి మాడ్చిన తరువాత కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టి వడపోసి, ఆ నీటిని తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గుతాయి.
8) ఉత్తరేణి  ఆకు రసమును  ముడుపూటలు  రెండు బొట్లు చొప్పున  చెవిలో వేసుకుంటే పంటి నెప్పి తగ్గుతుంది.
9) చిన్నా, పెద్దా ఎవరికైనా అజీర్తి చేసినప్పుడు అన్నం తినేటప్పుడు కొంచెం వాము పొడిని తింటే అజీర్తి ఉండదు.
10) ముఖం మీద  మొటిమలు బాగా ఉంటే కాకరకాయ గుజ్జుని ముఖానికి రాస్తే మొటిమలు పోతాయి.
11) బాగా వేడిచేసినప్పుడు మాడుకు ఆముదము రాస్తే వేడి తగ్గుతుంది.
12) కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు మజ్జిగ లో దూదిని ముంచి వాటిని కళ్ళ మీద పెడితే మంటలు తగ్గుతాయి.
13) చర్మం మీద దురదలు వస్తే విభూది రాస్తే వెంటనే దురద పొతుంది.
14) కాలిన గాయం మీద వెన్నపూస రాస్తే మంట తగ్గుతుంది.

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi