సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్లానింగ్‌లో ఉన్నాడు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి అనే విషయంపై ఎప్పటి నుండో అనేక వార్తలు విన్పిస్తున్నాయి. ఫ్రెష్‌లుక్ కోసం మొదట్లో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను ఈ సినిమాకు హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇతర కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో హీరోయిన్ కోసం మళ్లీ వేట మొదలు పెట్టారు చిత్ర బృందం. డైరెక్టర్ కొరటాల శివ తన 'శ్రీమంతుడు' సినిమా హిట్ కావడంతో శృతిహాసన్‌ను లక్కీగాళ్‌గా భావిస్తున్నాడు.
ఆ సెంటిమెంట్‌తో శృతిహాసన్‌నే ఈ సినిమాకు హీరోయిన్‌గా ప్రిపర్ చేయడం జరిగింది. కానీ ఎన్టీఆర్ సైడ్ నుండి చూస్తే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమా డిజాస్టర్ కావడంతోశృతిహాసన్‌తో మళ్లీ జత కట్టడానికి కొంచెం ఆలోచిస్తున్నాడట. కానీ డైరెక్టర్ ప్రెషర్ మీదకు చివరకు శృతినే ఓకే చెయ్యక తప్పలేదు. ఎన్టీఆర్‌కు ఈ సారి శృతిహాసన్ లక్ ఎలా కలిసివస్తుందో చూద్దాం!
|