Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: చంద్రకళ వాళ్ళందరూ మరియు జగదీష్ కూడా తాజ్-కృష్ణ  లోని ఫంక్షన్ హాల్లోకి వెళ్లి వాళ్ళకు కేటాయించిన టేబిల్ వద్ద కూర్చుంటారు. కాసేపటికి భూషణ్  గారి కుటుంబం కూడా వస్తారు అక్కడికి. అందరినీ గ్రీట్ చేసి, జగదీష్ పక్కనే కూర్చుంటుంది రాణి. చుట్టూ అందరూ పలకరింపులు, మాటల్లో ఉండిపోతారు. చంద్రకళ మ్యూజిక్ వింటూ లోనికి వస్తున్న గెస్ట్స్ ని చూస్తూ కూర్చుంటుంది. రాణి ఫ్రెండ్, రంజిత్ సూరి కూడా లోనికి రావడం కనిపిస్తుంది.. ఆ తరువాత...

 

అంతా గమనిస్తున్న జగదీష్, నవ్వడం మొదలు పెట్టాడు.  “నీతో బయటకి పోడానికి కూడా లేదే? ఇలా అభిమానులు ఉంటారుగా నీకు...” అంటూ ఎదురుగా ఉన్న ఓ గజేబో లోకి నడిచాడు.. వెనుకే ఫాలో అయ్యాను,,,,

“మోస్ట్ బ్యూటి ఫుల్ స్పాట్ జగదీష్,” అన్నాను క్రేడిల్  ల్లా ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ.....

నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన కారణం అర్ధం కాక, కుతూహలంగా ఉన్నా, అతనితో, ఇలా ఈ గార్డెన్స్ కి రావడం బాగుంది. మాజికల్  గా అనిపిస్తుంది..

జగదీష్ ప్రవర్తన గమ్మత్తుగా ఉన్నా, ఇంటరెస్టింగుగా ఉంది...’ అనుకుంటూ తల తిప్పి, నాపక్కన,కాస్త ఎడంగా కూర్చున్న అతని వంక చూశాను.

గాలికి చెదిరిన వత్తైన క్రాఫు అతని నుదుటిని కప్పేసింది.  సీ గ్రీన్ షర్ట్ పై గోల్డ్ నెక్-టై, బ్లాక్ స్వేడ్ పాంట్స్ తో మాచ్ చేసాడు...మంచి డ్రెసింగ్ సెన్స్ ఉన్నవాడే ‘జగదీష్’ అనుకున్నాను.

ఆ ఫార్మల్ అటైర్ లో చాలా అందంగా  ఉన్నాడు.  అతని నవ్వు, హెయిర్ స్టైల్, నడక, చాలా స్మార్ట్ గా ఉంటాడు.  నా కంటే పొడవుగా ఉంటాడు.
చూపు తిప్పుకుని, దూరంగా ఆడుతున్న పిల్లల వైపు దృష్టి సారించాను... 

ఏ ఆడపిల్ల కైనా జగదీష్ తప్పక నచ్చుతాడు.  మంచి పర్సనాలిటీయే కాక, సరదాగా మెలిగే నైజం, ఉన్నత విద్యలు, మంచి మనస్సున్న వాడు కూడా.. 

అందుకే రాణికి అతనంటే అంత ఇష్టం.  అతని బంధువైనందుకు, నేనంటే అయిష్టం.   జగదీష్ విషయంలో, నన్ను తనకి పోటీగా భావిస్తుంది. జగదీష్ నా పట్ల చూపించే శ్రద్ధ, అభిమానం, రాణీకి భరించలేని విషయాలే....

నా ఆలోచనలకి నాలో నేను నవ్వుకున్నాను.

“లాస్ట్ ఇన్ యువర్ వోన్ థాట్స్?  అదీ నేను నీ పక్కనే ఉండగా!” అన్న జగదీష్ మాటలకి.... ఆలోచన నుండి బయటపడ్డాను. 

“నో,నో... ఇక్కడే, నీ ఎదురుగానే ఉన్నాను....ఇప్పుడు చెప్పు. ఏమిటి ఈ పార్క్ ట్రిప్? ఏమిటి విశేషం?” అడిగాను.

“అయితే విను... విషయం చెబుతాను,” దగ్గరగా జరిగి, నా చేయందుకుని, గొంతు సవరించుకున్నాడు.

నా గుండె వేగంగా పరిగెడుతుంది...

“ఇన్నాళ్ళు నీ పట్ల ప్రొటెక్టివ్ గా ఫీల్ అయ్యాను.  నీవంటే స్నేహభావం మాత్రమే ఉండేది.రానురాను నా ఫీలింగ్స్ మారాయి.  నాకు నువ్వంటే ఇష్టం.  ఐ కేర్ ఫర్ యూ.  నా జీవితంలో నిన్ను తప్ప మరో అమ్మాయిని ఊహించలేక పోతున్నాను. 

ఐ లవ్ యూ చాంద్,” అన్నాడు జగదీష్ ఉద్వేగంగా...                     

జగదీష్ మాటలకి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి... కనబడకుండా తల వంచుకున్నాను.

నాకు నీ పట్ల ఉన్నభావంప్రేమగా మారిందనియేడాది క్రితమే అర్ధం చేసుకున్నాను.  నాకు నువ్వన్నా, నీ వ్యక్తిత్వంఅన్నా చాలా ఇష్టం. నీ నృత్యం అంటే అంతకన్నా ఇష్టం.యూ ఆర్ మై లైఫ్, చాంద్.

నీకు కూడా,అలోచించి నిర్ణయం  తీసుకునే మెచ్యూరిటీ వచ్చాకే, ఈ విషయం చెప్పాలని, ఇన్నాళ్ళు ఆగాను,”  అంటూ లేచి నిలబడి, చేత్తో తన  బ్లేజర్  పాకెట్ లోకి రీచ్ అయ్యాడు.

నిజమా? కలా? నా ఎదురగా, ఇంత సూటిగా తన ప్రేమని తెలియజేస్తున్న జగదీష్.....

నా జవాబు కోసం అడుగుతూన్న జగదీష్...

నమ్మలేక పోతున్నాను.

అతని మాటలు వింటున్నంతసేపు, అతనంటేనాకున్న నమ్మకం, ప్రేమ, ఆకర్షణ, అన్నీ ఒక్కసారిగా నన్ను కమ్మేసి, ఉక్కిరిబిక్కిరి  చేసాయి. 

ఉబికి వస్తున్న కన్నీళ్ళని గబగబా తుడుచుకుని, తల పైకెత్తాను.  చేతిలో గోల్డ్ కలర్ జ్యువలరీ బాక్స్ తో, నావంకే చూస్తున్నాడు జగదీష్. 

“ఏమిటిది,” అడిగాను...

నా కళ్ళల్లో నీళ్ళు గమనించి,  “వై టియర్స్ చాంద్? ముందా టియర్స్ తుడిచెయ్,” పక్కనే కూర్చుంటూ, తన కర్చీఫ్ అందించాడు జగదీష్..

“నా పట్ల నీకింతటి ప్రేమ ఉందని తెలుసుకున్న సంతోషమేమో,” నవ్వుతూ కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాను.

“అమ్మా వాళ్ళకి, నానమ్మ వాళ్ళకి, మీ అమ్మావాళ్ళకి అందరికీ నా ఆలోచన చెప్పాను.  అందరూ హ్యాపీ,”  అన్నాడు...

ఒక్కసారిగా వాళ్ళంతా నా కళ్ళముందు కదిలారు....

మౌనంగా ఉండిపోయిననా భుజం పైన మృదువుగా తట్టాడు.

“నీకు నా మనసులోని మాట ఇంత వివరంగా చెప్పిన సందర్భంగా,”  అంటూ తన చేతిలోని గోల్డ్ బాక్స్ నుండి ఓ అందమైన ఉంగరం తీసాడు జగదీష్...

“ఇది నీకు నా గిఫ్ట్.హోప్ యూ లైక్ థిస్.  నా పట్ల నీకు కూడా అంతటి  ప్రేమ, ఆకర్షణ  ఉందనే అనుకుంటాను.  నువ్వు స్పష్టంగా ఆ మాటలు నాకు  చెప్పేస్తే, మనం పెద్దవాళ్ళకి  తెలియజేద్దాం,” అంటూ నా వేలికి ఉంగరం తొడిగి,  దగ్గరగా వంగి, బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

అనుకోని ఆ సంఘటనకి ఒక్క క్షణం తడబడ్డాను.

తేరుకుని,నా వేలి మీది ఉంగరం వంక చూసాను.కెంపులు, ముత్యాలు పొదిగిన ఉంగరం, వెలుతురికి మరింత అందంగా ఉంది. నాకు తెలియకుండానే జగదీష్ కి దగ్గరగా జరిగి అతని చేతుల్లో  వొదిగిపోయాను.

నా ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని, “నేనంటే, మరి నీకూ ఇష్టమనే కదా!” నా పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు జగదీష్.  
మునుపెన్నడూ తెలియని అనుభూతితో,  నిలువునా కరిగిపోయాను.  అలా ఎంత సేపు గడిచిందో....…….తెలీలేదు.

జగదీష్ నా చేయి పుచ్చుకుని కారు వద్దకు నడిపించాడు. కారులో కూర్చున్నాక కూడా, నేను అతను చెబుతున్న మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాను. 

**                                                                         

“మరో పది నిముషాల్లో ఇంట్లో ఉంటాము.  నాకేమైనా చెప్పాలా,”  డ్రైవ్ చేస్తున్న జగదీష్ నవ్వుతూ అడిగేంతమటుకు, నా అందమైన ఆలోచనల్లో ఉండిపోయాను. 

అలా అతను అడగడంతో, నన్ను తొలిచేస్తున్న కొన్ని విషయాల్లో,నాకు ఓ స్పష్టత కావాలనిపించింది.

“ఒక విషయం ఉంది జగదీష్, మరి రాణి సంగతి ఏమిటి?” అడిగాను అతని వంక చూస్తూ.

నా చేతిని మృదువుగా తట్టాడు.

“చూడు చాంద్,  రాణి ఇజ్ క్రేజీ అబౌట్ మి... తనకి నేనంటే చాలా ఇష్టం.  నిజానికి, రాణి  స్వతహాగా మంచిదే  కూడా.  ఒక్క నీవంటే  ఈర్ష్య తప్పించి, షి ఇజ్  ఆల్రైట్...

కాకపోతే, రంజిత్ సూరి స్నేహం మానుకుంటే, తన ఆలోచన బాగుపడుతుంది,” నవ్వాడు.

‘నా ప్రశ్నకి ఇది జవాబు కాదు’ అన్నట్టుగా  చూసాను అతన్ని.....

నవ్వుతూ, “సరైన జవాబు కాదా?” అడిగాడు..

“అంతేగా” అన్నాను...

“అయితే  సరే, విను. అసలు మీ కోసమే నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటానని  నీకు చెప్పాను కదా? లేదంటే, తను మీకు ఇబ్బంది కలుగించగలదు...” అన్నాడు తాపీగా.

“నాకు తెలిసిన విషయమేగా,” గునిగాను..

“కదా!  అయితే, అసలు సంగతేమంటే, నాకెంతో ఇష్టమైన నువ్వు, నన్ను రిజెక్ట్ చేసావనుకో.  అప్పుడు, నేనంటే ఎంతో ఇష్టమున్న రాణి గురించి ఆలోచిస్తాను.. అదీ నా జీవితంలో రాణి స్థానం,” అన్నాడు...

ఆ వివరణకి  ఉలిక్కిపడ్డాను...

సడన్  బ్రేకుతో, ఇంటి ముందు కార్ పార్క్ చేసి, కారు దిగాడు జగదీష్...”పద, పద, ఇవాళ మీ రాణి ఇంట్లో మనకి డిన్నర్ కదా!” చుట్టూ తిరిగొచ్చి, నవ్వుతూ డోర్ తెరిచి పట్టుకున్నాడు, ...

**

నేను, జగదీష్ మనసు విప్పి మాట్లాడుకున్నామని తెలిసి అమ్మావాళ్ళు, కోటమ్మత్త చాలా సంతోషించారు.  విదేశీ టూర్స్ నుండి తిరిగొచ్చాక, సరయిన సమయం చూసి,  ఈ విషయమై, సాంప్రదాయంగా పెద్దవాళ్ళంతా కలవాలని, అప్పటివరకు ఈ విషయం బయటికి పొక్కవలసిన అవసరం లేదని, నిర్ణయించుకున్నాము.

వినోద్ కి కూడా ఓవెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు, జగదీష్.

**

డిన్నర్ కి వెళ్ళినప్పటి నుండి,జగదీష్ ని  అంటిపెట్టుకునే ఉంది, రాణి.  అతనికి ఇష్టమైన వంటకాలు చేయించానంటూ, దగ్గరుండి కొసరి కొసరి వడ్డించింది.

నేను, అమ్మ ముఖాలు చూసుకున్నాము. 

తినేది రుచించడం లేదు... అయినా ఎలాగో తిన్నాననిపించి అక్కడి నుండి కదిలాను.

డిన్నర్ తరువాత,  బయట లాన్ లో కూర్చున్నాము. 

ఎప్పటిలా ఫ్రూట్ సర్వ్ చేయించింది ఆంటీ.  తింటూ ఎవరి కబుర్లల్లో వాళ్ళున్నారు. 

ఇక్కడ కూడా, గార్డెన్-స్వింగ్ లో జగదీష్ పక్కనే కూర్చుంది రాణి.  అలా వాళ్ళని చూస్తుంటే, చాలా అసహనంగా ఉంది నాకు. 

అది చాలదన్నట్టు, మరునాటి హాస్పిటల్ టూర్ కి, జగదీష్ ని రాణి తీసుకు వెళుతుందన్నారు అంకుల్. 

రాణి,  జగదీష్ లు  కూర్చున్న దిశగా చూస్తూ, “చూడు జగదీష్, నీ ఆప్లికేషన్ ఫైల్ మన మెడికల్  డైరెక్టర్ వద్ద ఉంది.  ఏదన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే, రేపు మీటింగ్ కి లోగా,  ఇ-మెయిల్ చేసేయవచ్చు,” అన్నారు  జగదీష్ తో ఆయన.

ఇంతలో రాణి  కల్పించుకుంది.  “డాడీ, మీరు చెప్పడం ముగించి, మాట్లాడ్డానికి నాకు ఛాన్స్ ఇస్తారా?” అడిగింది.

“ఒకే బంగారం, గో అ హెడ్,” అన్నారు అంకుల్. “ఈ  వీకెండ్  సిగ్నిఫికెన్స్  గుర్తుందా?” పక్కనే ఉన్న జగదీష్ ని అడిగింది రాణి...విని, క్షణమాలోచించి, లేదన్నట్టు –పెదవి విరిచాడు జగదీష్.

“యు సిల్లీ – ఇట్ ఇజ్ క్యూపిడ్స్ డే -  వాలెంటైన్స్ డే.  రేపు రాత్రి మా ‘స్టార్ క్లబ్’ లో ఫెస్టివల్ ఉంది. ఎల్లుండేమో చెన్నై జిమ్కానా క్లబ్బులో గ్రాండ్ నైట్. విల్ యు ప్లీజ్ బి మై డేట్  టు దీజ్ ఈవెంట్స్,”  మా అందరి ముందే అడిగేసింది రాణి.

నేను  షాక్ అయ్యాను.అమ్మ నాన్న కూడా  ఆశ్చర్యపోయారని వాళ్ళని  చూస్తే  చెప్పొచ్చు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery