Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)

 

ఇంటికి ప్రహరీ రక్షణ కవచం.

నైసర్గిక వాస్తు దోషాలను అరికడుతుంది. గృహానికి ప్రహరీ లేకపోతే ఆ గృహం చుట్టూ ఉన్న వాస్తు దోషాల వలన అందులో  ఉండేవారు బాధపడవలసి వస్తుంది. అష్ట దిక్కులను మన గృహానికి అనుగుణంగా సవరించుకొని మేలు పొందాలంటే ప్రహరీ నిర్మాణం తప్పనిసరి. ప్రహరీ గోడను అనుభవం కలిగిన వాస్తు పండితుని పర్యవేక్షణలో నిర్మించాలి. పెరిగి ఉన్న మూలాలను,దిక్కులను సవరించి ప్రహరిని నిర్మించాలి. స్థలం ఉన్నంత మేరకు ప్రహరీని కట్టకూడదు. మంచి ఫలితాల కోసం దిక్కులను సవరించి ప్రహరిని కట్టాలి. యే నిర్మాణానికైనా ప్రహరీ తప్పనిసరి. గృహానికి ప్రహరీ చాలా ముఖ్యం. ప్రహరీలు లేని గృహం రాణించదు.


ప్రహరీ నిర్మాణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రహరి పునాది లేదా ఫౌండేషన్ ఎట్టి పరిస్థితిలోను ఇంటి పునాదిని మించకూడదు. ఇంటిపునాది కంటే ప్రహరీ పునాది ఎత్తులో ఉంటే ఇంటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దక్షిణం మరియు పడమర లు ఎత్తులో ఉండాలని కొంతమంది ఇంటి పునాది కంటే ప్రహరీ పునాది ని ఎత్తులో కడుతున్నారు. ఇది చాలా తప్పు. అన్ని దిశలందు ప్రహరీ ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ కన్నా తక్కువలోనే ఉండాలి.

ప్రహరీలకు తూర్పు ఉత్తరంలో కట్టే ఫౌండేషన్ దక్షిణం పడమరల ఫౌండేషన్ కన్నా తక్కువ  ఎత్తులో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రహరీ నిర్మాణం 2 విధాలుగా ఉంటుంది. 4  దిక్కులందు సమానమైన ఎత్తులో ప్రహరీ నిర్మించుట ఒక పద్దతి. తూర్పు ప్రహరీ పడమర ప్రహరీ కన్నా తక్కువలో మరియు దక్షిణం ప్రహరీ ఉత్తరం ప్రహరీ కన్నా ఎత్తులో ఉంచి ప్రహరీ నిర్మించుట 2 వ పద్దతి. ఈ రెండింటిలో 2 వ పద్దతి సరియైనది. ప్రహరీ కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముందుగా గృహానికి దక్షిణం, పడమరల వైపు ప్రహరీని నిర్మించాలి. ఈ దిక్కులందు ప్రహరీ లేకుండా తూర్పు, ఉత్తర దిశలందు కాంపౌండ్ నిర్మించరాదు. పడమర,దక్షిణాల వైపు జలాశయాలు, బావులు, బొర్లు, లోతైన గుంటలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నప్పుడూ  కొంత స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. ఈ పల్లపు ప్రాంతాలను ఆనుకొని ప్రహరీ కట్టకూడదు.

కనీసం 5 నుండి 12 అడుగుల వరకు ఖాళీ స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. అప్పుడే ప్రహరీ వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పడమర దక్షిణ ముఖాలుగా నిర్మించే గృహాల కు నైరుతి ప్రాంతం నందు ప్రహరికి ఆనించి మెట్లను నిర్మిస్తున్నారు ఇది తప్పు. అదేవిధంగా నైరుతి మూసివేయాలని మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్స్ నైరుతిని మూసివేసి నిర్మిస్తున్నారు ఇది కూడా చాలా తప్పు. ఈ విధమైన నిర్మాణాల వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ఇటువంటి నిర్మాణాలు వలన కాంపౌండ్ బయట ఉన్న పల్లంతో తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కాంపౌండ్ కు టచ్ చేసి మరుగుదొడ్లు నిర్మించవలసి వస్తే తప్పనిసరిగా కాంపౌండ్ బయట మట్టి వేసి ఎత్తు చేయాలి. కాంపౌండ్ బయట పల్లం లేకుండా మట్టి వేసి ఎత్తు లేపడం గాని లేదా అరుగులు వంటివి కట్టడంగాని చేయాలి. ప్రహరీ గోడకు గృహం లోని యే భాగము టచ్ కాకుండా నిర్మించడం మంచిది.

మరిన్ని శీర్షికలు
veekshanam