Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manoj ready...

ఈ సంచికలో >> సినిమా >>

వెంకీ వినోదానికి రెడీ అయిపోండిక

venkee ready to entertainment

వెంకటేష్‌ సినిమా అంటేనే ఫ్యామిలీ అంతా కూర్చుని హాయిగా చూసేలా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూనే ఎమోషన్స్‌కి కూడా విలువిచ్చేలా ఉంటాయి ఆయన నటించే సినిమాలు. ఆ తరహాలో విజయం సాధించినవే 'లక్ష్మీ, 'తులసి' వంటి సినిమాలు. ఇప్పుడు వెంకీ, మారుతి దర్శకత్వంలో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో చిన్న హీరోతోనే పెద్ద విజయాన్ని అందుకున్న మారుతి, ఇప్పుడు స్టార్‌ హీరో వెంకీతో కూడా ఆదే లాజిక్‌ను యూజ్‌ చేసుకొని సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమాకు 'బాబు బంగారం' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్‌ వెంకటేష్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందనే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ఈ సినిమాలో వెంకీ సరసన నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికే బిజినెస్‌ బాగా జరిగుతోందని టాక్‌ నడుస్తోంది. 'గోపాల గోపాల' సినిమా తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం కావడం ఇదే. 'గోపాల గోపాల' సినిమాలో మధ్య వయస్కుడిలా కనిపించిన వెంకటేష్‌ ఈ సినిమాలో స్లిమ్‌గా మరింత అందంగా యంగ్‌గా కనిపించనున్నారట. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నదట. 

మరిన్ని సినిమా కబుర్లు
lavanya  lucky