Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lover boy comming

ఈ సంచికలో >> సినిమా >>

ఐస్‌ క్రీం బేబీ సమంత

ice cream baby samanta

ఐస్‌ క్రీం అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలాగే మన క్యూట్‌ బేబీ సమంతకి కూడా ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం అంట. కానీ తనొక్కతే తినేస్తే ఇష్టం ఉండదంట. తనతో పాటు పది మంది ఫ్రెండ్స్‌ని ఐస్‌ క్రీం పార్లర్‌కి తీసుకెళ్లి వాళ్లందరికీ కడుపు నిండా ఐస్‌ క్రీం తినిపిస్తే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతుందట అమ్మడు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. దటీజ్‌ సమంత మరి. సినిమాల్లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణి అవ్వడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందున్నానంటోంది. ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా చాలా బిజీగా గడుపుతోంది. మహేష్‌తో 'బ్రహ్మూెత్సవం', నితిన్‌తో 'అ,ఆ..', ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక తమిళంలో సూర్యతో '24' లో కూడా నటిస్తోంది.

ఓ పక్క సినిమా అవకాశాలు, ఇంకోపక్క సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న సమంత, అన్నిటినీ ఎలా ప్లాన్‌ చేసుకుంటోందో ఎవరికీ అర్థం కావడంలేదు. తెరపై ముద్దు ముద్దుగా కనిపించడమే కాదు, సామాజిక కార్యక్రమాలతో తోటి నటీనటుల మెప్పు కూడా పొందుతోంది. ఐస్‌క్రీమ్‌ అంటే ఎవరికైనా ఇష్టమే. అలాగే ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ అన్నా అందరికీ ఇష్టమే. హీరోయిన్‌గానే కాకుండా, మంచి మనిషిగానూ పేరు తెచ్చుకున్న ఐస్‌క్రీమ్‌ బ్యూటీకి హ్యాపీ చెప్పాలి. 

మరిన్ని సినిమా కబుర్లు
prabhas busy with bahubali the  conclusion