Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'అ.. ఆ..' అలరించడానికొచ్చేస్తోంది

aa..aa movie is comming

నితిన్‌ సినిమా తెరపైకొచ్చి చాలా కాలమే అయ్యింది. 'చిన్నదానా నీ కోసం' సినిమా ఫర్వాలేదనిపించాక సూపర్ హిట్‌ కోసం నితిన్‌ ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నితిన్‌ సినిమా 'అ,ఆ..' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చక్కటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నితిన్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందేలా 'అఆ' చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతుంది. చిత్ర యూనిట్‌ చెబుతున్నట్లుగానే సినిమాకి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ లభించింది. ఈ మధ్యకాలంలో క్లీన్‌ యు సర్టిఫికెట్‌తో సినిమాలు రావడం చాలా అరుదుగా మారింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు, మంచి పంచ్‌ డైలాగ్‌లతో కూడిన క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుంది. 'అత్తారింటికి దారేది', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' చిత్రాలతో కుటుంబ విలువల్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, 'అఆ' సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. నితిన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా 'అఆ' నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనావ ఏస్తున్నాయి. జూన్‌ 2న అందర్నీ అలరించడానికి రాబోతున్నారు అనసూయ, ఆనంద్‌. అదేనండీ మన నితిన్‌, సమంత. 'అఆ'లో వీరి పేర్లు ఇవే. పేర్లను షార్ట్‌ కట్‌ చేసి సినిమా టైటిల్‌ పెట్టేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
biriyani expert NTR..