Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aa..aa movie is comming

ఈ సంచికలో >> సినిమా >>

బిరియానీ ఎక్స్‌పర్ట్‌ ఎన్టీఆర్‌

biriyani expert NTR..

గతంలో ఎన్టీఆర్‌ బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. అలా ఉండడానికి కారణం తిండిపై మక్కువనే చెబుతున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. పర్ట్‌క్యులర్లీ ఎన్టీఆర్‌కు బిరియానీ అంటే చాలా ఇష్టమట. అందులోనూ వాళ్ల అమ్మ చేసి పెట్టే రొయ్యల బిరియానీ అంటే మరీ ఇష్టం అంటున్నాడు ఈ అమ్మకి ముద్దుల కొడుకు. అంతే కాదు బిరియానీ వండి పెడితే తినడమే కాదు.. తానే స్వయంగా వండుకుంటాడట కూడా. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా రకరకాల బిరియానీలు చేసి ఫ్రెండ్స్‌కి మస్తుగా ఇంట్లోనే పార్టీ ఇచ్చేవాడట. అలాంటిది హీరో అయినాక ఆ బొద్దుతనం కొన్ని రోజులకి అడ్డం కావడంతో డైటింగ్‌ పేరుతో కొన్నాళ్లు తనకి ఎంతో ఇష్టమైన ఆ బిరియానీకి దూరంగా ఉండాల్సి వచ్చిందట. ఆప్పుడు ఎన్టీఆర్‌ నెలకి ఒకటి, రెండు సార్లు మాత్రమే బిర్యానీ తినేవాడట. పాపం ఎన్టీఆర్‌ కదా! ప్రస్తుతం ఈ యంగ్‌ టైగర్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమాలో నటిస్తున్నాడు. 'ఇక్కడ అన్నీ రిపేరు చేయబడును' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా సమంత నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో విపరీతమైన క్రేజ్‌ ఉంది. అలాగే, ఈ చిత్రం పట్ల తమిళ, మలయాళ సినీ రంగాలు కూడా ఆసక్తి చూపుతున్నాయట. ఆల్‌ ది బెస్ట్‌ టు ఎన్టీఆర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
deepika in hollywood