Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
snehamera jeevitham

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఒత్తిడి - బన్ను

Stress

ఈరోజుల్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. 'మానసిక ఒత్తిడి' కానివ్వండి. పని ఒత్తిడి కానివ్వండి. దీన్నే 'స్ట్రెస్' అని 'టెన్షన్' అని, 'యాంగ్జయిటీ' అనీ అంటారు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రిలేషన్స్ పాడవుతాయి. ఎనర్జీలెవల్స్ పడిపోతాయి మొత్తానికి మీ 'ప్రొడక్టివిటీ' తగ్గిపోతుంది. ఈ 'ఒత్తిడి' మన కండరాల మీద ప్రభావం చూపిస్తూ వుంటుంది. ఒత్తిడికీ మన 'శ్వాశ' కి సంబంధం వుందని ఓ ప్రముఖ ఫిజీషియన్ చెప్పారు. 'ప్రాణాయామం' చేస్తే కొంత ఉపసమనం కలుగుతుంది. మనసులో ఏమీ దాచుకోకుండా ఎవరితోనైనా 'షేర్' చేసుకుంటే ఉపసమనం కలుగుతుందని ఓ ప్రముఖ హిప్నాటిస్టు చెప్పారు. నేను కనీసం 6 - 7 డాక్టర్లను కలిశాను. వారందరూ చెప్పిన వాటి నుంచి సారాంశం ఇక్కడ మీకిస్తున్నాను.

* రోజుకు 10 సార్లు ముక్కుతో ఊపిరితీసుకుని, నోటితో వదలాలి.

* గట్టిగా ఊపిరి తీసుకుని కొంతసేపు వుంచి నెమ్మదిగా వదలాలి.

* ఒంటరిగా అస్సలు వుండకూడదు. నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి.

* ఎక్సర్ సైజ్ తప్పకుండా చేయాలి. కనీసం 'వాకింగ్' చేయాలి.

* రోజుకు కనీసం 7 గంటలన్నా నిద్రపోవాలి.

పైన ఉదహరించిన 5 సూత్రాలు పాటిస్తూ వుంటే కొంతవరకు ఉపసమనం కలుగుతుంది. ప్రశాంత వాతావరణంకి స్థలమార్పిడి కోసం నెలకో 2 రోజులు బయటికి వెళ్తే కూడా మనసు ప్రశాంతమై ఒత్తిడి తగ్గుతుంది. చాలా మంది 'యాంటీ యాంగ్జయిటీ' డ్రగ్స్ కి అలవాటై పోతుంటారు. లేదా 'Restyl' లాంటి మాత్రలకి బానిసలైపోతున్నారు. ఆ మాత్రలు పవర్ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఒకేసారి చేయకూడదని డాక్టర్ల సూచన. ఎవరన్నా Restyl 0.5 mg వాడుతుంటే వారు 2 వారాలు 0.25 mg వాడి తర్వాత 2 వారాలు 0.25 mg లో సగం వాడి, పావు వాడి అలా క్రమంగా తగ్గించాలట!

ఎన్నో టెన్షన్ల తో గడిపే మన జీవితంలో ఒత్తిడి సహజం! నేను చెప్పినట్టు 5 సూత్రాలు పాటించగలరు. 'ప్రాణాయామం' చక్కగా పనిచేస్తుంది.

మరిన్ని శీర్షికలు
Akkineni Ravisankar Prasad - Memories