Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

పకడో పకడో
'అమ్మ చెప్పింది' లో నాగబాబు కొన్ని రహస్యాలను మోర్స్ కోడ్ లో పంపిస్తుంటాడు. 'ఇదేమిటి ?' అని శర్వానంద్ అడిగితే వీడికేం తెలుస్తుందిలే అనే ధైర్యం తో 'పాట' అని చెబుతాడు.

శర్వానంద్ చూడ్డానికి మందబుద్ధి లా కనిపించినా విపరీతమైన మెమొరీ పవర్ అతనిది. సడన్ గా ఓ రాత్రి నిద్రలో (ఫొటో నం.1) ఆ కంప్యూటర్ లో తను చూసింది గుర్తొస్తుంది. ఉలిక్కిపడి లేస్తాడు (ఫొటో నం.2) పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కంప్యూటర్ లో తను చూసింది ఓ పాటలాగ వల్లె వేస్తాడు. (ఫొటో నం.3). ఇందులో ఏదో వుందని గ్రహించిన సీబీఐ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకుని, డీకోడ్ చేసి దొంగల్ని పట్టుకుంటారు.

ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే - పడుకునేటప్పుడు శర్వానంద్ వేసుకున్న డిజైన్డ్ తెల్ల టీ షర్ట్ - పరుగెత్తుకుంటూ బైటికి రాగానే ఆరెంజ్ రంగులోకి మారిపోతుంది. అదీ కథ ,,,

అరుదైన సంఘటన
జూలై 26 న చెన్నై లో రేడియో మిర్చి వారి అవార్దుల కార్యక్రమం జరిగింది. గ్రాండ్ జ్యూరీ మెంబర్ గా నన్ను కూడా అహ్వానించారు. వెళ్ళాను. రేడియో మిర్చి వారి ట్రీట్ మెంట్ అడుగడునా అత్యద్భుతంగా వుంటుంది. గత మూడేళ్ళుగా చూస్తున్నాను. వారి కమిట్ మెంట్ అలాగే వుంది. అవార్డుల కార్యక్రమం తర్వాత డిన్నర్ వుంటుంది.

దక్షిణ భారత సినీ సంగీత శాఖకు సంబంధించిన వారందరూ అక్కడ కలిసే అవకాశం వుంటుంది. ఆ రోజు జరిగిన ఆ డిన్నర్ ప్లేస్ లో పియానో వుంది.పియానో చూడగానే కోటికి ఎక్కడలేని మూడ్ వచ్చేసింది. వెంటనే వాయించడం మొదలుపెట్టారు. పక్కనే వున్న ఆర్పీ పట్నాయిక్, రమణ గోగుల , సునీత అందరూ చేరిపోయారు. తమ తమ గొంతులను కలిపారు. వారందరూ ఆలపిస్తూ వుంటే, కోటి పియానో వాయిస్తుంటే అక్కడ ఎంజాయ్ చెయ్యనివారు లేరు.

వీలయినంత వరకూ ఫొటోలు తీయగలిగాను. నాక్కూడా ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని నేను కూడా చేరి ఫొటో తీయించుకున్నాను. అరుదైన ఆ దృశ్యాన్ని మీరు కూడా చూసి ఆనందిస్తారనే నా నమ్మకం.

గిఫ్టెడ్ ఫ్రెండ్
కొంతమంది అంటే మనకు అబిమానం ఉండొచ్చు . కానీ స్నేహం లేకపోవచ్చు.మరికొంతమందితో గల పరిచయాన్ని స్నేహం అని పేరెట్టేసుకుని ఆత్మవంచన చేసేసుకుంటూ వుంటాం.ఎందుకంటే అందులో నిజమైన అభిమానం వుండదు గనుక. ఇవిలా వుండగా మరికొన్ని అభిమానాలు, స్నేహాలు చిన్నప్పుడున్నంత గాఢంగా వుండవు, ఇన్ని స్పీడ్ బ్రేకర్లని - ఇక బాగుపడతాయన్న ఆశలేని హైదరాబాద్ రోడ్ల మీదున్న గుంతల్లాంటి పరిస్థితుల్ని దాటుకుని - చెక్కుచెదరని స్నేహాలు కొన్నే వుంటాయి.

ప్రముఖ గాయని సునీత కి అమెరికా లోని డల్లాస్ లో వుంటున్న ఆమె బాల్య స్నేహితురాలు సౌజన్య తో గల స్నేహం కూడా అటువంటిదే ...

ఇటీవల అమెరికా లో జరిగిన 'పాడుతా తీయగా' కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించడానికి సునీత వెళ్ళినప్పుడు డల్లాస్ వచ్చి తనని కలిసే వరకూ ఆమె స్నేహితురాలు సౌజన్య ఊరుకోలేదు. ఇద్దరూ కలిసి తమ చిన్ననాటి అనుభవాలు పంచుకున్నారు. సునీత కి సౌజన్య ఐ ఫోన్ కవర్ ని కానుకగా ఇచ్చింది. ఆ కవర్ ఎంత ఆకర్షణీయంగా వుందో అంత ఖరీదయినది కూడా. మీరే చూడండి ... ఎంత బావుందో ...

(ఆగష్ట్ 4 ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా)







రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Megaphone at Cinematographers