Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anne porapaatle

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

ధూమచక్రం

గుప్పుగుప్పున సిగరెట్టు పొగలు...
ఎంతచెప్పినా వదలని తెగులు!

చావును దగ్గర చేసే పొగతాగుడు...
మంచికి చెప్పే మాటలు విని బాగుపడు!!


ఆధారాపాతం

అన్నిటికీ ఆధారే ఆధారం...
అక్రమాల కట్టడికి పరిష్కారం!

సాంకేతికత ఎంతున్నా ఏం లాభం...
అడ్డదారి సునాయాసంగా సౌలభ్యం!!


 

ఓట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సంక్షేమం పట్టని సర్కార్లు...
సీటూ, నోటూ, ఓట్లకు తయారు!

సామర్థ్యం లేనేలేని లీడర్లు...
సొంత లాభం చూసుకు పోతారు!! 

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu