Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

వరుసలో ఒక భక్తుడు: ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నదే! పైగా వరుస కదలడం లేదు, ఎవరికైనా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారా, ఏం?
అతడి వెనక నుంచున్న భక్తుడు: అందరికీ ఒకే దర్శనమే!
వ. ఒ. భ.: మీకెలా తెలుసు?
అ.వె.భ. : కోవెల ఆచారమే యిది కదా! ఇక్కడ రాజూ - పేదా తేడా లేదు! ఇంతకీ తమరి ఊరూ? పేరూ?
వ. ఒ. భ.: ఊరు చింతలపాడ, పేరు పెంచలయ్య! మరి తమరో?
అ.వె.భ. :  ఊరు హంపి! పేరు  శ్రీకృష్ణ దేవరాయలు!!
 


పక్కింటి బాలిక: "జో అచ్యుతానందా.. జో... జో .. ముకుందా.. " అని అమ్మ జోల పాడినా, నీకు నిద్ర పట్టలేదా?
ఎదురింటి బాలుడు: ఔను, అయితే ఆ పాటకి మా నాన్న నిద్రపోయాడు!
పక్కింటి బాలిక: ఆ తర్వాత?
ఎదురింటి బాలుడు: పాట ఆపి, మా అమ్మ నిద్రపోయింది!!

నల్లి పెళ్ళాం: మీ వైఖరి నాకేం నచ్చలేదండీ!
నల్లి మొగుడు: ఏం జరిగిందనీ?
నల్లి పెళ్ళాం: మీరు ఆ పక్కింటావిడ ఒళ్లో కనిపించారు
నల్లి మొగుడు: ఎప్పుడు?
నల్లి పెళ్ళాం: నిన్న! ఆవిడ ఇక్కడికొచ్చి గంటసేపు కూర్చుని వెళ్ళిందిగా??

జాంబవంతుడు: సుగ్రీవా, నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు?
సుగ్రీవుడు: వాలి ఇచ్చే గుద్దులు తిని, నొప్పితో మూలగడానికే సరిపోయింది. వేరే ఆలోచనకి వ్యవధి ఎక్కడిది??

అత్త, మామలు : కోడలా, నువ్వు మా గురించి అసలు పట్టించుకోవు. ఆ పక్కింటి వాళ్ళ కోడలు పిల్లను చూడు. ఎన్ని సేవలు చేస్తుందో!
కోడలు: ఆ కోడలు పేరు సక్కుబాయి! సేవలు చేసి తీరాలి! నాకేం ఖర్మ?

వీర శూర మహారాజు : "అనువుగాని చోట, అధికుల మనరాదు" - దీని అర్ధము ఏమి మహామంత్రీ?
మహా మంత్రి : క్షమించండి మాహారాజా, నా చెప్పులు చంకలో పెట్టుకోవడం మరిచాను (మోకాళ్ళు వంగి నమస్కారం చేస్తూ)


యమలోక సేవకుడు : ఏలికా, స్వర్గలోకం నుంచి వార్త వచ్చినది!
యమధర్మరాజు : ఏమని?
సేవకుడు : ఇక్కడ జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని, వాళ్ళు భోం చేస్తున్నప్పుడు, చూడలేకపోతున్నారట!! అందుకని ఆపి వేయమన్నారు, ఏలికా!!
 

శ్రీలంక రాక్షసుడు - 1 : ఏమిటీ ఉరుములూ, మెరుపుల శభ్దాలు, వర్షం వచ్చే సూచనలు లేవే?
శ్రీలంక రాక్షసుడు - 2 : అవి కుంభకర్ణుల వారి అంతఃపురం నుంచి వస్తున్నాయి! ఈ రోజు వారు, పప్పు కూడు ముద్దల్ని నాలుగు ఎక్కువ లాగించారులే!!
 

క్రిమి మొగుడు : ప్రియా... అలా, సూర్య రశ్మిలోకి షికారెల్లొద్దాం, రా!
క్రిమి పెళ్ళాం : సూర్య రశ్మి క్రిమి సంహారిణి, నేను రాను!
క్రిమి మొగుడు : ఈ చదువుకున్న పెళ్ళాన్ని ఒదిలించుకోవడం ఎలారా దేముడో!
క్రిమి పెళ్ళాం : ఏమిటీ, ఏదో గొణుగుతున్నారూ?
క్రిమి మొగుడు : ఎబ్బే ఏమీలేదు!
 
మరిన్ని శీర్షికలు
Panasapottu Koora