Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Megaphone at Cinematographers

ఈ సంచికలో >> సినిమా >>

అమెరికాలో కోన వెంకట్‌ లఘు చిత్రం

Short Film by Kona Venkat

రచయిత కోన వెంకట్‌ ఇప్పుడు దర్శకత్వం వహించాలనే ఆలోచనలో వున్న విషయం తెలిసినదే. పవన్‌కళ్యాణ్‌కి కథ చెప్పాలని, పవన్‌తో సినిమా చేయాలనే కసితో వున్న కోన వెంకట్‌, ఓ లఘు చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నాడు. లఘు చిత్రమంటే తక్కువ బడ్జెట్‌లో తూతూ మంత్రంగా తెరకెక్కిస్తుంటారు. కానీ, కోన వెంకట్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట లఘు చిత్రం తెరకెక్కించడాన్ని.

పూర్తిగా అమెరికాలోనే ఈ లఘు చిత్రాన్ని రూపొందించాడు కోన వెంకట్‌. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ వంటి అంశాల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధపెట్టిన కోన వెంకట్‌, కామెడీ ప్రధానంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారమ్‌. కామెడీ పంచ్‌లు విసరడంలో కోన వెంకట్‌ సత్తా అందరికీ తెలుసు కదా.

ఈ లఘు చిత్రం అవార్డులను దక్కించుకోవడం ఖాయమని, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుందని తెలుగు సినీ పరిశ్రమలో అందరూ అనుకుంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Sitaramasastry is slow down