Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Short Film by Kona Venkat

ఈ సంచికలో >> సినిమా >>

సీతారామశాస్త్రి ఎందుకు తగ్గించారు?

Sitaramasastry is slow down

సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి పాటలు జాలువారుతోంటే.. సాహిత్య పరంగా ఆ పాటలు అత్యద్భుతంగా వుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇదివరకు చాలా జోరు మీద పాటలు రాసిన సిరివెన్నెల ఇప్పుడు స్పీడు తగ్గించారు. సెలక్టివ్‌గా మాత్రమే పాటలు రాస్తున్నారు.

సిరివెన్నెల పాట కోసమే సినిమాలు రూపొందించేవారు, పాట చుట్టూ సినిమాలు అల్లుకునేవారూ వున్నారంటే, సిరివెన్నెల ‘రాత’ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిరివెన్నెల పాటల స్పీడు తగ్గించడం అతని అభిమానులకు అస్సలు నచ్చడంలేదు. కాని, సిరివెన్నెల మాత్రం పోటీ ప్రపంచంతో పరిగెత్తకుండా తన కలం పదును తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు.

ఎన్ని పాటలు రాశామని కాదు, రాసిన పాటలు ప్రేక్షకులను ఎంత అలరించాయన్నదే ముఖ్యం. ఆ విషయంలో సిరివెన్నెలకు తిరుగు లేదు. శాస్త్రిగారి పాట పదే పదే వినాలనుకునేవారి కోసం ఆయన వేగం కొంచెమైనా పెంచితే బావుణ్ణు.

మరిన్ని సినిమా కబుర్లు
Gopi Mohan as Director