Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sitaramasastry is slow down

ఈ సంచికలో >> సినిమా >>

దర్శకుడిగా మారనున్న గోపీమోహన్‌

Gopi Mohan as Director

కోన వెంకట్‌ ` గోపీ మోహన్‌ కాంబినేషన్‌ గురించి తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. శ్రీనువైట్ల, కోన`గోపీమోహన్‌ల కాంబినేషన్‌లో సూపర్‌ హిట్స్‌ వచ్చాయి. ఈ ముగ్గురిలో శ్రీనువైట్ల దర్శకుడైతే కోన వెంకట్‌ డైలాగులు, గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లే.. ఇలా ముగ్గురూ తమ తమ విభాగాల్లో రాణించి, సినిమాల్ని హిట్‌ చేస్తారు.

వివిధ విభాగాలవారు మెగా ఫోన్‌ పట్టుకోవడం అనేది మామూలు విషయంగా మారింది. కోన వెంకట్‌ దర్శకత్వ ప్రయత్నాల్లో వుండగా, గోపీమోహన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. రవితేజతో గోపీమోహన్‌ ఓ సినిమా చేస్తారని గతంలో వార్తలు వినవచ్చాయి.

ప్రస్తుతం గోపీమోహన్‌ డ్రీమ్‌ స్క్రిప్ట్స్‌ని రెడీ చేసుకుంటున్నాడట. ప్రముఖ హీరోలతో టచ్‌లో వున్నాడనీ, త్వరలోనే దర్శకుడిగా తన సత్తా చాటుకోనున్నాడనీ సమాచారమ్‌. మెగా ఫోన్‌ పట్టనున్న గోపీమోహన్‌, దర్శకుడిగా ఎంత సక్సెస్‌ అవుతాడో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Varma comment on Telangana