Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Varma comment on Telangana

ఈ సంచికలో >> సినిమా >>

హీరోయిన్‌ మరణ వార్త

Death news of a heroine

రాజేంద్రప్రసాద్‌తో ‘వాలుజెడ తోలు బెల్టు’ సినిమాలో నటించిన హీరోయిన్‌ కనక చనిపోయిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆమె కొన్ని రోజులనుంచీ క్యాన్సర్‌తో బాధపడుతున్నదనీ, క్యాన్సర్‌తో పోరాటంలో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయిందనీ ఆ వార్త సారాంశం.

ఈ వార్త కనక చెవిన పడింది. అంతే తాను బతికే ఉన్నట్లు మీడియాతో చెప్పక తప్పలేదు కనక. తనకు క్యాన్సర్‌ లేదనీ, క్యాన్సర్‌కి అయినా దేనికైనా భయపడిపోనని కనక చెప్పడంతో అందరూ షాక్‌ తిన్నారు.

వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు కనక. మళ్ళీ సినిమాల్లో నటించమని అవకాశాలు వస్తున్నట్లు చెప్పిన కనక, తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పారు.

అలనాటి సినీ నటి దేవిక కుమార్తె అయిన కనక, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి స్టార్స్‌ సరసన పలు సినిమాల్లో నటించారు. 

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chuddam