Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Akkineni Ravisankar Prasad - Memories

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలంగాణ గురించి ఇలా అనుకోమన్న సినీ పెద్దలు - .

Tollywood comments on Telangana

తెలుగు సినిమాకి గతంలో తెలంగాణ టెన్షన్‌ ఉండేది. రాష్ట్ర విభజన ఖాయం కావడంతో ఆ టెన్షన్‌ కొంతవరకు తగ్గిందని చెప్పవచ్చు. సినిమా ప్రముఖులు పెద్దగా ఈ అంశంపై దృష్టిపెట్టలేదని అనుకోలేం. కాని ఎవరూ దీనిపై కామెంట్‌ చేయడానికి ఇష్టపడటంలేదు.

లోలోపల ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు ఒకరినొకరు కలిసినప్పుడు తెలంగాణ అంశం చర్చకు వస్తున్నదట. ఇప్పుడంటే ఒకే స్టేట్‌లో సినిమాలు విడుదల చేసేవాళ్ళం, ఇకపై రెండు రాష్ట్రాల్లో సినిమాలు విడుదలవుతాయని అనుకుంటున్నారు వారంతా. అలాగే మీరూ అనుకోండని కొందరు తెలంగాణపై ప్రశ్నిస్తే సమాధానమిస్తున్నారు.

పాజిటివ్‌ థింకింగ్‌ ఎప్పుడూ మంచిదే కదా. కర్నాటక, తమిళనాడుల్లో సినిమాలు విడుదల చేసి పొరుగు భాషలంటున్నాం, ఇకపై తెలంగాణ, లేదంటే ఆంధ్ర ఏదో ఒకటి పరాయి రాష్ట్రంగా భావించాల్సి వస్తుంది. కాని భాష ఒకటే కదా. ఇరు ప్రాంతాల్లోనూ సినీ పరిశ్రమ వర్ధిల్లి, పెద్దసంఖ్యలో సినిమా వల్ల జీవించేవారి సంఖ్య పెరిగి, తెలుగు సినిమా విరాజిల్లితే మంచిదే.

మరిన్ని శీర్షికలు
anne porapaatle