Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Karunasri 'Jandhyala Papayya Sastry'

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఆగష్టు 02 - ఆగష్టు 08) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మంచిది. శుక్రవారం మాటను పొదుపుగా వాడుట మంచిది. శని, ఆది, సోమ వారాలలో చేపట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. మంగళ, బుధ వారాలలో అధికమైన ఆలోచనల మూలాన కొంత ఇబ్బందిని పొందుటకు అవకాశం ఉంది. గురువారం భాదను కలిగించే వార్తను వింటారు. దుఃఖాన్ని పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు పాటించుట ఉత్తమం ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను ప్రారంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. ఉద్యోగంలో మాత్రం అధికారులతో అనుగుణంగా నడుచుకొనుట సూచన. నిర్ణయాలను తీసుకొనేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ధర్మసంబంధమైన పనులలో ఈ వారం సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. క్రిందిస్థాయి ఉద్యోగులతో చేపట్టిన పనులలో లాభంను పొందుతారు. కుటుంబ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.     

వృషభ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కాలదు. శుక్రవారం పనిని త్వరగా పూర్తిచేయాలి అనే తలంపును కలిగి ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మంచి వార్తలనే వింటారు. శని, ఆది వారాలలో మాటను పొదుపుగా వాడుట అనారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పనిలో కొంత నిదానం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉండకపోవచ్చును. సోమ, మంగళ వారాలలో ఇష్టమైన వారితో కలిసి నూతన పనులను చేపడుతారు. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. స్త్రీ /పురుష సౌఖ్యంను పొందుతారు. పనులలో వేగం పెరుగుతుంది సమయానికి పూర్తిచేస్తారు. బుధ, గురువారాలలో బంధువుల మూలాన ఆందోళన పొందుతారు. కొంత నిరుత్సాహంకు గురయ్యే అవకాశం కలదు. అశుభవార్తను వింటారు, మానసికంగా దృడంగా ఉండుట అవసరం. దాదాపు తలపెట్టిన పనులలో విజయంను పొందుతారు. తోటివారితో కలిసి నూతన పనులను చేపడుతారు. వారం మొత్తం కూడా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా మెలగండి. స్నేహితులతో మాత్రం జాగ్రత్తగా ఉండుట సూచన.  

మిథున రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతిపనిలో శ్రద్ధను కలిగి ఉండుట మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం మాత్రం జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. ఎవ్వరితోను మాట పట్టింపులకు పోకండి. ఎక్కువ ఆలోచనలు చేయకండి. శని, ఆది, సోమ వారాలలో మాత్రం మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. మిత్రులతో కలిసి పనులను చేపడుతారు. మంగళ, బుధ వారాలలో తలపెట్టిన పనులలో ఫలితాలు ఆలస్యంగా రావడం మూలాన కొంత ఆందోళన పొందుతారు. గురువారం పెద్దల మూలాన ఆశించిన ఫలితాలను పొందుతారు. వారం మొత్తం ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. బంధువులతో చేయు పనులలో మాట పట్టింపులకు పోకండి. కుటుంబంలో కూడా నిదానంగా వ్యువహరించుట మేలు. సరైన నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగంలో మాటపడవలసి రావచ్చును. సమయ పాలన అవసరం. వ్యతిరేక వర్గం వారు మీ పై చేయు సాదించే అవకాశం కలదు. అకారణంగా తిరుగుట మూలాన శ్రమను పొందుతారు. 

కర్కాటక రాశి
ఈవారం ఆర్ధికపరమైన విషయాలలో ధనలాభమును పొందుతారు. చేపట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మానసికంగా సంతోషాన్ని పొందుతారు. శని, ఆది, సోమ వారాలలో చేపట్టిన పనులలో ఖర్చులు పెరిగే అవకాశం కలదు. తలపెట్టిన పనులలో శ్రమను పొందుతారు. నిదానముగా ఆలోచించి పనులు చేయుట మంచిది. మంగళ, బుధ వారాలలో ప్రణాళికా ప్రకారం ముందుకు వెళితే పనులలో విజయాన్ని పొందుతారు. భోజన సౌఖ్యమును పొందుతారు. గురువారం ఆరోగ్య పరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. కుటుంబంలో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుకు పోయే మనస్తత్వాన్ని కలిగి ఉండటం ఉత్తమం. స్నేహితులతో కలిసి చేయు పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించటం శ్రేయస్కరం. ఉద్యోగము లో చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోకండి. అధికారుల వలన భయాన్ని పొందుతారు. వ్యతిరేకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

సింహ రాశి
ఈ వారం మీరు ఆలోచనలు చేయుటలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నిదానంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. శుక్రవారం ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని, ఆది, సోమ వారాలలో బంధువులతో కలిసి నూతన ప్రయత్నాలు చేస్తారు. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్ధికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మంగళ, బుధవారాలలో ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి . గురువారం పనులలో కొంత ముందుకు వెళతారు. సంతోషకరమైన వార్తలను వింటారు. నూతన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. మనో ధైర్యాన్ని కలిగి ఉండి నూతన పనులు ప్రారంభిస్తారు. అధికంగా ప్రయాణాలు చేయటం వలన ధన వ్యయాన్ని పొందుతారు. చేపట్టిన పనుల వలన అందరిలో గుర్తింపును కలిగి ఉంటారు. మీ వ్యతిరేక వర్గం వారిని ఇబ్బంది పెట్టగలుగుతారు. కుటుంబ సౌఖ్యమునకు ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. కావున తొందరపాటు పనికి రాదు. 

కన్యా రాశి
ఈ వారం మీరు గతవారం కన్నా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆర్ధికపరమైన విషయాలలో సర్దుబాటులు జరగటం వలన ఇబ్బందులు ఉండకపోవచ్చును. చేపట్టిన పనులలో లాభాన్ని పొందుతారు. శుక్రవారం కుటుంబంలో నూతన నిర్ణయాలను తీసుకోకపోవటం మంచిది. శని, ఆది, సోమ వారాలలో ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. ఇష్టమైన పనులలో సమయాన్ని గడుపుతారు. మంగళ, బుధవారాలలో బంధువర్గంతో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. భోజన సౌఖ్యమును కలిగి ఉంటారు. గురువారం మాత్రం ఆలోచనలు పెరుగుతాయి. తగ్గించుకునే ప్రయత్నం చేయుట మంచిది. సంచారం చేయుట వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశముంది జాగ్రత్త. కుటుంబంలో నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం. ఖర్చుల విషయంలో సరైన అవగాహన కలిగి ఉన్నచో మేలు జరుగుతుంది. అకారణంగా సంచరించటం వలన ఇబ్బందులను పడాల్సి వస్తుంది. శస్త్రముల వలన చోరుల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త .

తులా రాశి
ఈ వారం మీరు రాజకీయ వ్యవహారాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. శరీర సౌఖ్యమునకు ప్రాధాన్యతనిస్తారు. శుక్రవారం మాత్రం ఆరోగ్యమునకు ప్రాముఖ్యతనివ్వటం మంచిది. అజీర్తి లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడే అవకాశం ఉంటుంది. శని, ఆది, సోమ వారాలలో ఉద్యోగములో తగిన జాగ్రత్తలు పాటించుట మేలు చేస్తుంది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవటం ఉత్తమం. మంగళ బుధ వారాలలో గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. గురువారం బంధువుల గృహంలో సంతోషంగా గడిపే అవకాశం కలదు. చేపట్టిన పనులలో ధనలాభం ఉంటుంది. స్థాన చలనం పొందు అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచనలను తోటివారు వ్యతిరేకిస్తారు. ఏ విషయంలో నిరుత్సాహమును పొందకండి. ముందుకు వెళ్ళు ప్రయత్నం మేలు చేస్తుంది. గృహలాభామును పొందుతారు . స్త్రీ/పురుష సౌఖ్యమును కలిగి ఉంటారు. మధుర పదార్ధములయందు ఆసక్తిని కనబరుస్తారు. 

వృశ్చిక రాశి
ఈ వారం మీరు చేపట్టిన పనులలో తొందరపాటుతనంతో పోకుండా నిదానంగా వ్యవహరించటం మేలు చేస్తుంది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. చేపట్టిన పనులలో ఖర్చును నియంత్రించటం మంచిది. శుక్రవారం విందులు వినోదాలలో పాల్గొంటారు. ఆనందమును పొందుతారు. శని, ఆది, సోమ వారాలలో అనారోగ్య సమస్యలు పొందుటకు అవకాశం కలదు. పని భారం ఉండొచ్చు. శారీరక శ్రమను పొందుతారు. కుటుంబంలో నూతన నిర్ణయాలను వాయిదా వేయండి. ఉద్యోగములో సర్దుబాటుతనం అవసరం. మంగళ, బుధవారాలలో ఆకారణముగా కలహములు ఏర్పడుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట సూచన. గురువారం నూతన ప్రయత్నాలను ఆరంభిస్తారు. ప్రయాణాల వలన గతంలో తీసుకున్న రుణాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. అకారణంగా భయాన్ని పొందుతారు. ఉద్యోగములో అధికారుల మూలాన తిప్పలు తప్పక పోవచ్చును. కోపమును తగ్గించుకునే ప్రయత్నమును చేయండి. పెద్దల సూచనలను సలహాలను పాటించండి.

ధనస్సు రాశి
ఈ వారం మీరు ఫలితాలను ఆశించుటలో సమయం తీసుకునే ప్రయత్నం చేయండి. దాని వలన మేలు జరుగుతుంది. మీ వ్యతిరేక వర్గం వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యంతో పనులను చేపడతారు. ఒక వార్త కొంత బాధకు గురిచేటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండటం మంచిది. శుక్రవారం కుటుంబ జీవితంలో సౌఖ్యమును పొందుతారు. ఆర్ధికపరమైన విషయాలలో ముందుకు వెళతారు. నూతన పనులను చేపడతారు. శని ఆది సోమ వారాలలో అనుకూలమైన ఫలితాలను కలుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. మంగళ బుధ గురువారాలలో అనారోగ్య సమస్యలకు గురి కావచ్చును. కుటుంబంలో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల నిదానంగా వ్యవహరించండి. నూతన వస్తు ప్రాప్తిని కలిగి ఉంటారు. పరోపకార్యాలు చేయుటనందు ఆసక్తిని కలిగి ఉంటారు. వినోదాలలో పాల్గొంటారు. విద్యా సంబంధమైన విషయాలలో ఆసక్తిని కనబరుస్తారు. రాజకీయ వ్యవహారాలలో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరుస్తారు. 

మకర రాశి
ఈ వారం మీరు మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. శుక్రవారం చేపట్టిన పనులలో ఉత్సాహ భంగం, అనుకోని వార్తలను వినుట మూలాన ఇబ్బందిని పొందుతారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళనను కలుగ చేస్తుంది. శని, ఆది, సోమవారాల్లో ఆర్ధిక పరమైన అంశాలో విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించటం వలన మేలు జరుగుతుంది. బుధ, గురువారాలలో ధన లాభాన్ని పొందుతారు. అందరిలో గుర్తింపు పొందే అవకాశం కలదు. సమాజంలో గుర్తింపును కోరుకుంటారు. నూతన విషయాలయందు ఆసక్తిని చూపిస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలను మాత్రం అశ్రద్ధ చేయకండి. పరోపకార్యములయందు ఆసక్తిని కలిగి ఉంటారు. తోటి వారు మీవలన లాభాన్ని పొందుతారు. వినోదాలలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. చర్చలలో మీ యొక్క అభిప్రాయాలను సంకోచం లేకుండా తెలిపే ప్రయత్నం చేస్తారు. వృత్తి స్థానంలో అభివృద్దిని పొందుతారు. అందరిని కలుపుకుని వెళ్ళుట వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అధికారులతో, తోటి ఉద్యోగులతో నిదానంగా వ్యవహరించటం మేలు.

కుంభ రాశి
ఈ వారం మీరు చాలా వరకు చేపట్టిన పనులలో ముందుకు వెళతారు. మంచి ఆలోచనలను కలిగి ఉండుట మేలు చేస్తుంది. నూతనంగా తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఉత్సాహమును కలిగి ఉండి ముందుకు వెళతారు. శుక్రవారం మానసికంగా ఆందోళనను చెందే అవకాశం ఉంది. శని, ఆది, సోమవారాలలో చేయు ప్రయత్నాలలో పెద్దల సలహాలను సూచనలను పాటించండి. మంగళ, బుధవారాలలో పెద్దల సహకారంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ జీవితంలో మంచి మార్పులు పొందు అవకాశం కలదు. అందరితో సమయాన్ని గడుపుతారు. ఆర్ధికపరమైన విషయాలలో లాభాన్ని పొందుతారు. సమయానికి భోజనం చేసే ప్రయత్నం చేయండి. పని భారమును కలిగి ఉంటారు. అకారణంగా కలహములు ఏర్పడుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించండి. ఉద్యోగములో మాత్రం మీరు చేపట్టిన పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంతోషమును పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం ఉత్తమం. 

మీన రాశి
ఈ వారం మీరు అనుకోకుండా నూతన పనులను చేపట్టే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ధన వ్యయాన్ని పొందుతారు. శుక్రవారం ఉత్సాహమును కలిగి ఉంది నూతన పనులను చేపడతారు. ఇష్టమైన వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. శని ఆది సోమ వారాలలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు కలుగుత వలన మానసిక ఆందోళనను పొందుతారు. బుధ గురువారాలలో ఒక వార్త మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. గురువారం ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. సర్దుకుపోవటం మంచిది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్ధికపరమైన విషయాలలో మాత్రం బాగానే ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు లేనట్లయితే ఇబ్బందులు తప్పకపోవచ్చును. కుటుంబంలో శ్రమను పొందుతారు. స్వల్ప ఇబ్బందులను కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. మిత్రులతో కలిసి సమాలోచనలు చేస్తారు.  

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
padya mandapam book review