Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
O pedda durabhiprayam

ఈ సంచికలో >> శీర్షికలు >>

స్నేహమేరా జీవితం - లాస్య రామకృష్ణ

snehamera jeevitham

"పాదమెటుపోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడూరానా
చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా
గుండె ప్రతిలయలోనా నేను లేనా
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా
ఓ.... మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ.... మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచినా స్నేహమా"


ఒక కొవ్వొత్తి గదిలో వెలుగుని నింపుతుంది. ఒక స్నేహం జీవితంలో వెలుగుని నింపుతుంది. అంధకారం లో ఉన్నప్పుడు వెలుగుకి దారి చూపించేది, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తోడ్పాటనందించేది స్నేహం. అటువంటి మధురమైన స్నేహం దొరకడం కూడా ఒక అదృష్టం. అమ్మా, నాన్నా లేని వాళ్ళు అనాధలు కాదు నిజమైన స్నేహితులు లేని వాళ్ళు అనాధలు.

స్నేహితులు ఎందుకు కావాలి

సంతోషాన్ని పంచుకునేందుకు
మనం ఏదైనా విజయం సాధిస్తే మనకు తెలిసిన వాళ్ళందరితో పంచుకోవాలని అనుకుంటాము. అటువంటిది స్నేహితులతో పంచుకోవడానికి మరింత ఆసక్తి కనబరుస్తాము. సంతోషాన్ని పంచుకుంటే అది మరింత ఎక్కువ అవుతుంది. స్నేహితులతో పంచుకోవడం వల్ల వాళ్ళ నుండి అందే అభినందనలు మన మనస్సుకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

ఓదార్పు కోసం
ఏదైనా బాధ కలిగినప్పుడు మనస్సుకు దగ్గరి వాళ్లతో పంచుకోవాలనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని కొన్ని సంగతులు స్నేహితులతో పంచుకుంటాము. స్నేహితుల నుండి అందే ఓదార్పు ఊరట కలిగించి ఎటువంటి పరిస్థితినైనా చాలా సులభంగా పరిష్కరించుకోగలిగే శక్తి ని ప్రసాదిస్తుంది.

విమర్శిస్తారు
మీలోని బలహీనతలను మీకు తెలియచేసి వాటిని సరిదిద్దుకునేందుకు తోడ్పడే వారే నిజమైన స్నేహితులు. నిజమైన విమర్శకులే నిజమైన స్నేహితులు.

మిమ్మల్ని మీరుగా అంగీకరిస్తారు
చేతివేల్లు అన్నీ ఒకలాగా ఉండవు. అలాగే అందరు వ్యక్తులూ ఒకలా ఉండరు. మిమ్మల్ని మీరుగా గుర్తించే వాళ్ళే నిజమైన స్నేహితులు. మీరు ఇలా ఉంటేనే స్నేహం చేస్తాను అనే వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు.

సర్దుకుపోతారు
కొన్ని కొన్ని విషయాలలో అభిప్రాయ బేధాలు కలగడం సహజం. అంత మాత్రాన స్నేహ బంధాన్నివదులుకోకూడదు. అన్ని విషయాలలో స్నేహితులలో ఏ ఒక్కరు మాత్రమే సర్దుకుపోకూడదు. ఇద్దరూ సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి. రాజీకి రావడం అనేది స్నేహం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి విషయం లోను, మీరే సర్దుకుపోతున్నారు అంటే మీ స్నేహితుని లేదా స్నేహితురాలి గురించి ఒకసారి ఆలోచించవలసిందే.

నమ్మకం కలిగి ఉంటారు
ఏ బంధమైనా కలకలం నిలిచి ఉండాలంటే కావలసింది నమ్మకం. స్నేహబంధం లో కూడా నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నమ్మకం లేని స్నేహం నిలువదు. పైగా అపార్ధాలకు తావిస్తుంది. అనవసరమైన గొడవలు, చికాకులు, మనస్పర్ధలు లేకుండా ఉండే స్నేహం నమ్మకం కలిగి ఉన్నది.

పట్టించుకుంటారు
స్నేహితుని బాగోగులు పట్టించుకుంటారు. స్నేహితుని అవసరాలని తన అవసరాలుగా భావించి సహాయం చేస్తారు. స్నేహితుల నుండి కేవలం తీసుకోవడం మాత్రమే కాకుండా వారికి అవసరానికి చేయుతని అందిస్తారు.

మరి ఇటువంటి నిజమైన స్నేహం మీ సొంతమా? వారికి ఈ ఆగష్టు 4 న మరచిపోకుండా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతారు కదూ!!!

మరిన్ని శీర్షికలు
Stress