Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
namo venkateshaya shooting started

ఈ సంచికలో >> సినిమా >>

జోరు జోరుగా మెగాస్టార్‌ మూవీ

megastar movie is going on

చిరంజీవి 150వ చిత్రం మొదలైంది. సినిమా రీమేక్‌ అనుకున్న తరువాత కూడా సెట్స్‌ మీదికెళ్లడానికి చాలా టైం పట్టింది. దాంతో సినిమా చాలా లేట్‌ అయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వేశారు. కానీ సెట్స్‌మీదికెళ్లాక సినిమా చాలా జోరుగా నిర్మాణం జరుగుతోంది. అనుకున్న ప్రకారం షెడ్యూల్‌ తొందరగా పూర్తయిపోతోంది. ఒక్క హీరోయిన్‌ విషయంలో మాత్రమే క్లారిటీ రాలేదు. కానీ మిగతా షెడ్యూల్‌ అంతా ఫాస్ట్‌గా నడుస్తోంది. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్‌ నటి జయప్రద ప్రత్యేక పాత్రలో కనిపిస్తోందట.

ఈ సినిమా పాటల్ని విదేశాల్లో చిత్రీకరించనున్నారట. మెగాస్టార్‌ రీ ఎంట్రీలో రాబోతున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్‌' సంచలన విజయాన్ని అందుకుంది. మెగాస్టార్‌కి వినాయక్‌ వీరాభిమాని కావడంతో సెట్‌లో అంతా సరదా సరదాగా సాగిపోతోంది. తమ అభిమాన హీరో మెగాస్టార్‌తో కలిసి టీం అంతా ఆనందంగా గడుపుతున్నారు సెట్‌లో. కథల ఎంపికలో చాలా తాత్సారం జరిగింది. 'కత్తి' రీమేక్‌ అనుకున్న తర్వాత కూడా అందులో మార్పులు, చేర్పుల కోసం సమయం తీసుకున్నారు. ఇలా స్టార్టింగ్‌ లేట్‌ అయినా షూటింగ్‌ ఫాస్ట్‌గా జరగుతూండడంతో అనుకున్న టైంకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీనుకురానున్నారట. మెగాస్టార్‌కి ఇంకో వీరాభిమాని దేవిశ్రీ, మెగాస్టార్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా మాంచి మాస్‌ బీట్స్‌ని సిద్ధం చేస్తున్నాడు. దేవి బీట్స్‌కి తగ్గట్టుగా మెగాస్టార్‌ స్టెప్పులేయనున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
every thing is vaishakam