Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిత్రం భళారే విచిత్రం - మావూరు.విజయలక్ష్మి

 

వామ్మో....... కిరాడు 


కొన్ని విషయాలు వింటే...... అవి అభుతకల్పనలేమో అని కొట్టిపారేస్తాం.  కాని వాటిమీద జరుగుతున్న  పరిశోధనలు, అన్వేషణలు చూస్తే మాత్రం నమ్మకతప్పదు. అలాంటి వింతే ఈ దేవాలయనిది కూడా. ఆ గుడిలో దాగున్న ఒక మిస్టరీ గురించి వింటే మాత్రం ఆశ్చర్యంతో నోరు తెరుచుకోకమానదు. చీకటి పడిన తరువాత ఆ గుడిలోనికి గనక వెళితే ఇక అంతే సంగతులు...! అలా వెళ్ళినవారు మరిక తిరిగి రారట...! రాకపోతే ఏమవుతారు? ఏమవుతారు.... రాళ్లవుతారు. అవును మీరు చదివినది అక్షరాల నిజం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది?  ఓహ్... గుడిలో ఇంత దారుణమా.... నిజంగా నమ్మశక్యం కాని విషయం! ఇంతకీ ఎక్కడుందా గుడి? చూద్దాం.....
    కిరాడు:
    కిరాడు... ఓ అద్భుతం! ఓ వింత! ఓ మిస్టిరియస్ ప్లేస్! కొంతకాలం క్రితం ఎం టి వి వారి ఓ రియాలిటీ షో ద్వారా వెలుగులోనికి వచ్చి అక్కడ్నుంచి బయటిప్రపంచం ముందుకొచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులను చీకటి పడకముందే అక్కడినుండి వెళ్ళిపొమ్మని తొందర చేస్తారట స్థానికులు. ఆ ప్రాంతమంతా చూద్దామన్న ఉత్సాహంతో స్థానికులను తోడు రమ్మంటే, సాయంత్రం వరకు మాత్రమే మనకు తోడుగా ఉంటారు. సాయం సంధ్య అయిం తరువాత ఎంతగా అడిగినా ఒక్క క్షణం కూడా మనకు తోడుగా ఉండరు. స్థానికులను అంత భయపెట్టిందా గుడి. నిజానికి మనం ఎలాంటి కష్టనష్టాలు లేకుండా బతకడానికి భగవంతుడ్ని వేడుకుంటాం. భగవంతుడు మనకు ఎల్లవేళలా సాయపడతాడని నమ్ముతాం. మరి అలాంటి భగవంతుడు కొలువుతీరిన ప్రాంతంలో మనుషులు అంతగా భయపడదమేంటి? అంతగా భయపెడుతున్నాడంటే ఆ గుడిలో ఉన్నది దేవుడేనా...? ఇంకెవరైనానా? ఏముందా గుడిలో..? అసలింతకీ ఎక్కడుందా గుడి?
వింతలకు, విశేషాలకు ఆలవాలమయిన రాజస్థాన్ బర్మార్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్ కి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మ గ్రామంలో ఉంది కిరాడు గుడి.నిజానికి ఇది ఒక గుడి కాదు అయిదు ఆలయాల సమూహమైన సోమేశ్వరగుడి. ఈ ఐదింటిలో ప్రస్తుతం విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడిని మాత్రం చూడడానికి వీలవుతుంది. మిగిలినవి శివదేవునికి అంకితం చేయబడినవి. వేల సంవత్సరాల పురాతన ఆలయం. నిజానికి ఒక మరుగునపడిన దేవాలయం ఇది. కాని దీనికున్న అసాధారణమైన మిస్టరీ కారణంగ ప్రస్తుతం ఒక పర్యాటకస్థలంగా ప్రసిద్ధి చెందింది.
గుడి వెనుక మిస్టరీ 
ఆ ఆలయంలో సూర్యాస్తమయం అయింతరువాత ఉంటే మనుషులు రాళ్లుగా మారిపోతారట.  దేవాలయం అంటే సాక్షాత్తూ bhagaవంతుడుండే చోటు. మరి అలాంటి చోట మనుషులు రాళ్లుగా మారడమేం టి? వింతగా లేదూ?! కాని deeనికంతటికి కారణం ఒక రుషి శాపమేనట. సుమారు తొమ్మిది వందల ఏళ్ల కిందట జరిగిన విషయం. ఒక రుషి శిష్య సమేతంగా దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. తన శిష్యులను ఈ దేవాలయం దగ్గర ఉంచి తాను మాత్రం చుట్టుపక్కల అంతా తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం సంచారం చేస్తూ ఉండిపోయాడు రుషి. ఇక ఇక్కడున్న శిష్యులు రోగగ్రస్తులయ్యారు.రోగాలతో బాధపడుతున్న ఆ శిష్యులకు స్థానికులెవరూ సహాయం చెయ్యలేదు. శిష్యులు ఎన్నో ఇక్కట్లకు గురయ్యారు. అయినప్పటికీ  ఎవ్వరూ సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొంత కాలానికి రుషి తిరిగి వచ్చి చూసి, జరిగినది తెలుసుకొని, ఆగ్రహంతో రగిలిపోయాడు. బండ బారిన హృదయంతో రాళ్ల లాగా ప్రవర్తించి తన శిష్యుల బాధలకు కారణమయిన స్థానికులను బండరాళ్ల లాగా మారిపొమ్మని శపించాడట. అయితే ఒక స్త్రీ మాత్రం తన శిష్యులకు కొంత సహాయం చేసిందని తెలుసుకొని, ఆమెను వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మని, అలా అయితే నీవు ఈ శాపం నుంచి బయటపడతావని చెప్పాడు. కాని కొంతదూరం వెళ్ళిన ఆ స్త్రీ maaనవ సహజమైన ఉత్సుకతతో వెనక్కు తిరిగి చూసే సరికి ఆమె కూడా రాయిలాగా మారిపోయిందని, కాల క్రమేణ ఆ శాపం దేవాలయం వరకు పరిమితమయిందని స్థానికుల కథనం. ఆ స్త్రీ యొక్క రాతిmooర్తిని ఇప్పటికి కూడా సమీప గ్రామంలో చూడవచ్చని చెప్తారు స్థానిక ప్రజలు.
శాపం లేదు .... కాని ఏదో ఉంది.....
స్థానికంగా వినవస్తున్న ఈ కథనాలను గురించి విని కొందరు ఔత్సాహికులు ఈ ఆధునిక యుగంలో ఇంకా ఇలాంటి నమ్మకాలేవిటంToo  పరిశోధనకు బయలుదేరారు. అలా బయలుదేరిన వారు స్థానికులను తీసుకొని ఆలయానికి బయలుదేరారు. వెళ్ళిన వారికి అన్ని విషయాలు, వివరాలు దగ్గరుండి చూపించిన స్థానికులు సాయంత్రమyyE సరికి మాత్రం ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదంటూ వెళ్ళిపోవాలంటూ తొందర చేయసాగారట. మీరనుకున్నట్లు ఏమీ జరగదు... భయపడవద్దు అంటూ ఎంత నచ్చచెప్పినా, ధైర్యం చెప్పినా వారి భయం మాత్రం తగ్గలేదట. మేమిక మీతో ఉండలేమని చేతులేత్తేసారట. మీరు కూడా ఆలయంలో ఉండవద్దంటూ హితవు చెప్పారట. అయినా  కూడా పరిశోధకులు మాత్రం ధైర్యం చేసి ఆలయం లోకి వెళ్లారు. దాదాపు రాత్రి పన్నెండు గంటల వరకు ఆలయంలో గడిపారు. ఆలయంలో వారికేలాంటి మార్పులు, తేడాలు కనిపించలేదట. అంతా మాములుగానే అనిపించిందట. కాని సమయం గడుస్తున్న కొద్దీ వారిలో తెలియని భయం గూడు కట్టుకొసాగిందట. వారికే తెలియకుండా వారిలో ఏదో అందోళన ఏర్పడడం మొదలయిందట. అంత ధైర్యంగా ఇవన్నీ మూడ నమ్మకాలు, పుక్కిటి పురాణాలని కొట్టిపారేసి, ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా ఆలయంలో అడుగుపెట్టిన వారి లోని ధైర్యం సన్నగిల్ల సాగిందట. అసలు ఎందుకిలా జరుగుతోందో వారికి అర్ధం కాలేదట. ఎంతగా ఆలోచించినా ఎందుకిలా జరుగుతోందో వారి కర్ధం కాలేదు. పైగా....అర్ధ రాత్రి దాటేసరికి ఇక అక్కడ ఉండలేని పరిస్థితుల్లో భయంతో అందరూ గుడి బయటకు పరుగున వచ్చేసారట. సో.... ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో తెలియని పరిస్తితి మాత్రం గూడు కట్టుకొని ఉందని అంటున్నారు ఆ పరిశోధకులు.
రాజస్తాన్ ఖజురహో......
తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పరమార్ వంశస్థులు కట్టించిన ఈ ఆలయాల పరిసరాలు, వాతావరణం, ముఖ్యంగా ఆలయాల నమూనాలు, వాటి శిల్ప కళారీతుల నైపుణ్యం, వీటన్నిటి కారణంగా ఈ ఆలయాలను రాజస్తాన్ ఖజురహోగా పిలవడం కూడా జరుగుతోంది. ఈ శాపాల మాటెలా ఉన్నా, ఆ ఆలయాల అంద చందాలు, కళా నైపుణ్యాలు, కట్టడాల ఆకర్షణ, వాతావరణం కారణంగా ఇప్పుడు అది ఒక పర్యాటక కేంద్రంగా మారింది.

 

.

మరిన్ని శీర్షికలు
avee - ivee