Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lemon specialty

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథా సమీక్షలు - - చెన్నూరి సుదర్శన్.

కథ : దటీజ్ స్వాతి
రచయిత    :  సుంకర వి. హనుమంతరావు
 సమీక్ష : చెన్నూరి సుదర్శన్
గోతెలుగు 117వ సంచిక!


కథ ఆద్యాంతం మంచి బిగువుతో నడిపించారు రచయిత సుంకర వి. హనుమంతరావు గారు. కథ చదివినంత సేపు ఏకాంకిక నాటికను మన మస్తిష్క తెరపై చూసినట్లు అనుభూతి కలుగుతుంది. 

గో తెలుగు చక్కటి కుటుంబ అంతర్జాల వార పత్రికలో క్రమేణా కథల ఎంపిక విషయంలో నాణ్యత గుబాళిస్తూ పరిమళాలు వెదజల్లుతోంది. ఆ కోవలో ఈ కథానిక ప్రచురితం ముదావహం.

కథాక్రమం.. 

స్వాతి, సౌమ్య ఇద్దరూ ప్రాణ స్నేహితులు కనుక  స్వాతి, గోపిల ప్రేమాయణం సౌమ్యకు తెలుసు. అయితే గోపి వరకట్న దురాశతో స్వాతిని కాదని మరో అమ్మాయి లావణ్యను పెళ్లి చేసుకో బోతాడు. అ పెళ్ళికి స్వాతి హాజరవబోతోంది.. సౌమ్య అగ్గిమీద గుగ్గిలమౌతోంది. 
అలా ఆరంభమైన కథలో పెళ్లి జరిగిందా.. ఆగిందా? ఆగితే ఎలా ఆగింది? ఎందుకాగింది? ఎవరి వల్ల ఆగింది.  మొదలగు ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకులు కింది ఇవ్వబడిన లింకు విప్పిచదివితే బాగుంటుందని నా అభిప్రాయం.

కథ నడక వరకట్న దురాచారం పై సమర శంఖ పూరణం.. నడత వరకట్నమభిలషించే  యువత గుండెల్లో ఎక్కుపెట్టిన విల్లు. కథలో వాడిన ప్రతీ మాట సమజంలో దూసుకెళ్ళే తూటా.. కథనం కాదనరంగంలా సాగింది.

‘స్వాతి చూపుల శూలాలు గోపి గుండెల్లో దిగుతున్నాయి’ అన్నట్లుగా మాధవ్ గారి బొమ్మ చాలా అద్భుతంగా ఉంది. బొమ్మను చూడగానే కథ చదువకుండా ఉండలేము. 

అందుకే నా మనసుకు హత్తుకు పోయింది.. సమీక్ష వ్రాయాలనే తపనకు కారణమైంది.  పాఠకుల నుండి సైతం మంచి స్పందన వచ్చింది. 
నేనూ     వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని పోరాడే వాణ్ణి. కాలేజీలో నా విద్యార్థులకు కవితా రూపంలో ప్రబోధించే వాణ్ణి.

 “చదువు లేకున్నా నథింగ్,
 సంపాదించాలి సంతింగ్,
ఈజీ మెథడ్ వెడ్డింగ్,
కట్నం కానుకలూ విల్లింగ్,
తెలేదంటే కిల్లింగ్,
మరో పెళ్ళంటే విల్లింగ్”
అనే వెధవని తీయాలి హాంగింగ్.  ***

    
  ఈ కథను ఈ క్రింది లింక్ లో   చదవచ్చు.....  http://www.gotelugu.com/issue117/3078/telugu-stories/that-is-swati/

మరిన్ని శీర్షికలు
mahima gala marrichettu