Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manchu lakshmi vilan as mohanbabu

ఈ సంచికలో >> సినిమా >>

తెలంగాణా నుంచి ఆంధ్రాకి

telangana to andhra

శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'. ఆధ్యంతం వినోదంగా సాగిపోయే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివరాజ్‌ కనుమూరి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో కథానాయకుడు కరీంనగర్‌ నుండి కాకినాడకు ఉద్యోగం కోసం వస్తాడు. అక్కడ నడిచిన లవ్‌స్టోరీయే ఈ సినిమా. ఇంతవరకూ తన కామెడీతో ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డిని హీరోగా నిలబెట్టే సినిమా ఇది. గతంలో అంజలి ప్రధాన పాత్రలో 'గీతాంజలి' సినిమాలో దాదాపుగా హీరో పాత్ర పోషించాడు శ్రీనివాస్‌ రెడ్డి. కానీ ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కావడంతో ఆ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా అంజలి ఖాతాలోకి వెళ్లిపోయింది.

అయినప్పటికీ కూడా ఆ సినిమా శ్రీనివాస్‌రెడ్డికి చాలా పేరు తెచ్చింది. ఆ చిత్రానికన్నా ఎక్కువగా ఇప్పుడు ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా' శ్రీనివాస్‌రెడ్డికి హీరోగా మంచి గుర్తింపునివ్వనుందట. 'జమ్ము నిశ్చయమ్మురా' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీనివాస్‌రెడ్డి, హీరోయిజం చూపిస్తూనే ఆయన పండించే కామెడీ కడుపుబ్బ నవ్విస్తుందంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా ఈ సినిమా ప్రచార చిత్రం విడుదలయ్యింది. ప్రచార చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ చాలా చాలా బాగుంది. సినిమా చూస్తూ హాయిగా నవ్వుకుంటారనీ, ధియేటర్‌ నుంచి బయటికి వచ్చినా కూడా నవ్వుకుంటారనీ, అంత వినోదంగా మా సినిమా ఉంటుందంటున్నాడు హీరో శ్రీనివాస్‌ రెడ్డి. నవంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
ijam kalyanram