Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ijam kalyanram

ఈ సంచికలో >> సినిమా >>

రత్నమహాదేవి నయనతార

nayanatara as ratnamahadevi

కొన్ని సినిమాల్లో నయనతారని తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం. విలక్షణ పాత్రలతో సత్తా చాటుకుంటున్న నయనతార తాజాగా 'రత్నమహాదేవి' అనే పాత్రలో కనిపించబోతోంది. కార్తీ హీరోగా రూపొందుతున్న 'కాష్మోరా' చిత్రంలోని ఆమె పాత్ర అది. 'రత్నమహాదేవి'గా నయనతార ఠీవీ చూసి అంతా నివ్వెరపోతున్నారు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు పోషించిన నయనతార 'శ్రీరామరాజ్యం', 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో కనిపించి మెప్పించింది. తమిళంలో చాలా సెలక్టివ్‌గా మాత్రమే నయనతార సినిమాలు చేస్తోందిప్పుడు. తెలుగులో కొంత గ్యాప్‌ తర్వాత ఇటీవలే 'బాబు బంగారం' సినిమాలో నటించింది. ఏ పాత్రకైనా న్యాయం చేయగల టాలెంట్‌ నయనతార సొంతం. అందుకే కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నా నయనతారకున్న డిమాండ్‌ ఏమాత్రం తగ్డడంలేదు.

మూడు కోట్ల దాకా నయనతార రెమ్యునరేషన్‌ పలుకుతోందంటేనే ఆమెకున్న డిమాండ్‌ ఏమిటనేది అర్థమవుతోంది. 'రత్నమహాదేవి'గా 'కాష్మోరా' సినిమాలోని ఆమె లుక్‌ రివీల్‌ అవగానే, 'అరుంధతి' తరహా సినిమా నయనతారతో చెయ్యవచ్చునన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఇదివరకు హీరోయిన్ల కెరీర్‌ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడలా కాదు. వయసు మీద పడుతున్న కొద్దీ డిమాండ్‌ ఇంకా పెరిగిపోతుందనడానికి అనుష్క, నయనతార వంటి తారలే నిదర్శనం కావొచ్చు. అనుష్కతో పోల్చి చూసినప్పుడు నయనతార ఇంకా వేగంగా సినిమాలు చేస్తోంది. అదీ ఆమె ప్రత్యేకత. ఏదేమైనా 'రత్నమహాదేవి' పాత్ర నయనతార కెరీర్‌లో ది బెస్ట్‌ కాబోతోందన్న 'కాష్మోరా' యూనిట్‌ మాటలు నిజమవ్వాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam