Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh muragadas speed   increase

ఈ సంచికలో >> సినిమా >>

'గౌతమి పుత్ర శాతకర్ణి'కి రాజమౌళి ప్రశంస

rajamouli appreciate goutami putra sathakarni

'బాహుబలి' పోరాట సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోయేలా లేదు అన్న కాంప్లిమెంట్‌ బాహుబలి దర్శకుడు రాజమౌళి నుంచి రావడం కంటే 'గౌతమి పుత్ర శాతకర్ణి'కి గొప్ప కాంప్లిమెంట్‌ ఇంకేముంటుంది? టాలీవుడ్‌లో గ్రాఫిక్స్‌ అంటే దానికో బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసిన మూవీ బాహుబలి అయితే, బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి'ని మించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే గ్రాఫిక్స్‌ బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో ఉపయోగించారట. సినిమా టీజర్‌ విడుదలైన వెంటనే ఇదే టాపిక్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పరిమితమైన వనరులతోనే అద్భుతమైన ఔట్‌పుట్‌ సాధించడం క్రిష్‌ ప్రత్యేకత. 'కంచె' సినిమాతో క్రిష్‌ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ సినిమా కోసం ఎంతైనా గ్రాఫిక్స్‌ చేయొచ్చు.

కానీ అవకాశం ఉన్నంతమేర సహజత్వం కోసం సన్నివేశాలు చిత్రీకరించి, గ్రాఫిక్స్‌ చాలా తక్కువగా వాడాడు. ఆ సినిమాకి ఇంకెవరైనా అయితే భారీగా బడ్జెట్‌ అయ్యేది. క్రిష్‌ చాలా జాగ్రత్తగా, పకడ్బందీ ప్రణాళికతో ఈ సినిమా చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఔట్‌పుట్‌ వచ్చింది. అయితే 'శాతకర్ణి'కి బడ్జెట్‌ సమస్యలేమీ లేవు. దాంతో ఆయన చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే 'గౌతమి పుత్ర శాతకర్ణి' టీజర్‌ అత్యద్భుతంగా రూపొందింది. సినిమా విజువల్‌ వండర్‌ అనే భావనను టీజర్‌ కలగజేయడం అభినందనీయం. 

మరిన్ని సినిమా కబుర్లు
rashmi so lucky