Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raj tarun as blimd

ఈ సంచికలో >> సినిమా >>

వీరాభిమాని కోసం నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌

pawan as producer for fan

పవన్‌ కళ్యాణ్‌కి యంగ్‌ హీరో నితిన్‌ వీరాభిమాని. నితిన్‌కి పవన్‌ది లక్కీ హ్యాండ్‌ కూడా. 'ఇష్క్‌' సినిమా నుండి తనలోని అభిమానాన్ని బయట పెట్టడం స్టార్ట్‌ చేశాడు నితిన్‌. అప్పట్నుంచీ తన సినిమాలో ఏదో ఒక చోట పవన్‌ ప్రస్థావన తప్పకుండా ఉంటుంది. పాట, ఫోటో, డైలాగో లేకపోతే పవన్‌ మేనరిజమ్స్‌ ఇలా ఏదో ఒక రకంగా పవన్‌ని టచ్‌ చేస్తాడు నితిన్‌. అయితే ఇప్పుడు ఏకంగా పవన్‌ నిర్మాణంలోనే సినిమా చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించేసుకున్నాడు నితిన్‌. వీరాభిమాని కోసం పవన్‌ నిర్మాతగా మారడం చాలా గొప్ప విషయమే. ఇంతవరకూ తన అభిమానుల కోసం ఆడియో ఫంక్షన్స్‌కి హాజరు కావడం, తనదైన స్టైల్లో వారి సినిమాలకు ప్రమోషన్స్‌ చేయడం మాత్రమే చేసిన పవన్‌ ఇప్పుడు ఏకంగా అభిమాని కోసం నిర్మాతగా అవతారమెత్తాడు.

పవన్‌ తనకు ఎంతో సన్నిహితుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నితిన్‌ తండ్రి కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మూలకథను అందించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే 'అ,ఆ..' సినిమాతో సూపర్‌ సక్సెస్‌ మీదున్నాడు నితిన్‌. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్‌ నితిన్‌ ఖాతాలో ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. కృష్ణ చైతన్య ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌, మిగతా టెక్నీషయన్స్‌ వివరాలు త్వరలోనే వెల్లడి చేయనుంది చిత్ర యూనిట్‌. 
 

మరిన్ని సినిమా కబుర్లు
shailaja...shailaja