Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaanachana maala story

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఆగష్టు 16 - ఆగష్టు22) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం చేపట్టేపనులను ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట వలన మేలుజరుగుతుంది. శుక్రవారం కొంత ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. శని,ఆదివారాలో కుటుంభంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. సోమవారంనుండి గురువారం జాగ్రత్తగా పనులను ఆరంభించినచొ విజయంను పొందగలరు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. బుధ,గురువారాలలో బంధవులను కలుస్తారు వారితో సమయాన్ని కేటాయిస్తారు. మొత్తం కూడా పనులకు సంభందించిన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం మేలు ,మొత్తం మీద పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాల విషయంలో చక్కటి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటేనే ప్రయాణం చేయండి. కుటుంభంలో నిదానం అవసరం సర్దుబాటు విధానం మేలుచేస్తుంది.      

వృషభ రాశి

ఈవారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. శుక్ర, శనివారాలలో కొంత అధికమైన ఆలోచనలు కలిగి ఉండుట చేత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పని పైన శ్రద్ధను పెట్టుట ఉత్తమం. అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు. అశ్రద్ద కూడదు. ఆది, సోమ వారాలలో ప్రతి విషయంలో నిదానం, అలాగే జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు, జాగ్రత్త వహించుట మేలు. మంగళ, బుధ వారాలలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయంలో ఈవారం ఈరోజుల్లో సంతృప్తికరమైన వార్తను వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గురువారం చేపట్టిన పనుల మూలాన అందరిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆదాయం పెరుగుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. వారం కొద్దిగా శ్రమించుట చేత మంచి ఫలితాలను పొందుతారు. బందువులతో, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మంచివారితో మీకున్న పరిచయం మేలుచేస్తుంది.  

మిథున రాశి
ఈవారం ప్రయత్నకార్యములలో విజయంను పొందుతారు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. శుక్రవారం నూతన పనుల పట్ల మక్కువను కలిగి ఉంటారు ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తారు. శని,ఆది వారలు ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. అందరితో కలిసి పనులను చేయుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. సోమ,మంగళ వారాల్లో పనిఒత్తిడి మూలాన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కలదు. ఫలితాలు అనుకూలంగా రాకపొవచ్చును నిరాశను పొందుతారు. బుధ,గురువారాల్లో కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకపోవడం మేలు అలాగే అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయండి మంచిది. పెద్దవాళ్ళతో పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది, కళల పట్ల మక్కువను కలిగి ఉంటారు వాటికి సమయాన్ని కేటాయిస్తారు అదేవిధంగా గుర్తింపును పొందుతారు. 
 

కర్కాటక రాశి
ఈవారం దైవసంభంద పనులలో సమయాన్ని గడుపుట మంచిది. శుక్రవారం కొంత చేదుసంగటనలు జరిగే అవకాశం కలదు కొంత ఇబ్బందిని పొందినను మనోదైర్యంతో కోలుకుంటారు. శని,ఆదివారాల్లో నూతన పనులను చేపట్టే అవకాశం కలదు పెద్దల సహకారం తీసుకోవడం మేలుచేస్తుంది. సోమ,మంగళ వారాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో లాభంను పొందుతారు. నూతన పరిచయాల మూలాన సౌఖ్యంను పొందుతారు. నూతన పనులను చేపట్టే అవకాశం కలదు కాకపోతే పనిఒత్తిడి మూలాన బుధ,గురువారాల్లో స్వల్ప ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుట మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిది. అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావోచ్చును,శత్రువుల మూలాన ఇబ్బందులు కలుగుటకు ఆక్సరం ఉంది జాగ్రత్త. వ్యాపారస్తులు నిదానంగా ఉండుట మేలు.   

సింహ రాశి
ఈవారం కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుతారు దేహసౌఖ్యంకు ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశముంది.  శుక్రవారం ప్రయత్నకార్యముల యందు చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. శని,ఆదివారాల్లో ఒకవార్త ఒకింత ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట మేలు. తలపెట్టిన పనులలో కలిగే ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది పెద్దల సూచనలను పాటించుట మంచిది. సోమ,మంగళ వారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. మీ ఆలోచనల మూలాన తోటివారికి మేలుజరుగుతుంది. కుటుంబజీవితంలో వచ్చిన మార్పులు ఆనందంను కలుగజేస్తాయి. బుధ,గురువారాల్లో అందరిలో గౌరవాన్ని పొందుతారు. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది.
 

కన్యా రాశి
ఈవారం గతంలో చేపట్టిన పనులకు సంభందించిన ఫలితాల్లో సంతృప్తిని కలిగి ఉంటారు. గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన ఉద్యోగఅవకాశాలలో అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు.  అకారణంగా ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు జాగ్రత్త.శుక్రవారం ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు నచ్చిన పనులను చేపడుతారు. మనోదైర్యంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుట మూలాన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. శని,ఆది వారాల్లో కొంత ఫలితాల మూలాన నిరాశను పొందుటకు అవకాశం కలదు. సోమ,మంగళ వారాల్లో అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. బుధ,గురువారాల్లో చక్కటి ప్రణాళికను కలిగి ముందుకు వెళ్ళుట వలన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. కుటుంభంలో సంతోషాన్ని పొందుతారు.

తులా రాశి
ఈవారం ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మంచి ఫలితాలను పోద్నుతారు.  మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు.  శుక్రవారం పనిభారంను పొందుతారు. పనులు నిదానంగా సాగుతాయి నూతన పనులను చేపట్టకపోవడం మంచిది. శని,ఆదివారాల్లో గతంలో చేపట్టిన పనులకు సంభందించిన ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. సోమ,మంగళ వారాల్లో కొద్దిగా పనుల్లో నిదానం అవసరం. బంధువులతో మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. బుధ,గురువారాల్లో అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. ప్రయాణాల్లో లేదా వారం మొత్తం విలువైన వస్తువుల పట్ల తప్పక జాగ్రత్త వహించాలి అశ్రద్ద కూడదు. పెద్దలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొనుట మేలు. 

వృశ్చిక రాశి
ఈవారం కొత్త విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. గతకొంత కాలంగా వేదిస్తున్న సమస్య తొలిగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.  శుక్రవారం మృష్టాన్నభోజన ప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. శరీర సౌఖ్యంకు ప్రాధాన్యతను ఇస్తారు. శని,ఆదివారాల్లో నిదానంగా ఉండుట మంచిది. ప్రతిపనిలో నిదానం అవసరం తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోమ,మంగళ వారాల్లో ఇష్టమైన వారితో చర్చలలో పాల్గొంటారు వారికి సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థికపరమైన విషయల్లో అనుకూలమైన ఫలితాలను కలిగి ఉంటారు. బుధ,గురువారాల్లో ప్రతిపనిలో నిదానం అవసరం తలపెట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. నూతనంగా తలపెట్టే పనులలో సానుకూల ఫలితాలను నిదానంగా పొందుతారు ప్రత్యేక శ్రద్ద అవసరం.

ధనస్సు రాశి
ఈవారం శుక్రవారం అధికమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. బంధ్వుమిత్రులతో మాటపట్టింపులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండుట మేలు. శని,ఆదివారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. మంచి ఆలోచనలు చేసినచో మన్ననలను పొందుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. సోమ,మంగళ వారాల్లో    మాటపట్టింపులకు పోకండి. నూతన విషయాల పట్ల ఇస్టంను కలిగి ఉన్నను పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. బుధ,గురువారాల్లో అనుకున్న సమయానికి చేపట్టిన పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన వస్తువులను కొనే అవకాశం ఉంది అలాగే అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండుట సూచన. అకారణంగా భయాన్ని కలిగి ఉంటారు నూతన వస్తువులను కొనాలనే ఆలోచన విరమించుకోండి లేకపోతే ధననష్టాన్ని పొందుటకు అవకాశం ఉంది. 

మకర రాశి
ఈవారం శుక్రవారం బంధువులతో నూతన పనులను చేపడుతారు పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. శని,ఆదివారాల్లో కొత్త విషయాల గురుంచి ఆలోచన చేయుటకు అవకాశం కలదు. అనుకోని ఖర్చులను కలిగి ఉండే అవకాశం ఉంది జాగ్రత్త. సోమ,మంగళ వారాల్లో శరీరసౌఖ్యంకు ప్రాధాన్యతను ఇస్తారు. మీ ఆలోచనలు మంచి పేరును తెచ్చిపెడుతాయి. బుధ,గురువారాల్లో స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. ప్రతిపనిలో నిదానంగా ఉండుట సూచన. వారం మొత్తం కూడా అధికారులతో సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండుట మంచిది. అనారోగ్యాన్ని అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. పెద్దలయందు అభిమానాన్ని కలిగి ఉంటారు వారితో కలిసి నూతన విషయాల పట్ల ఆలోచన చేయుటకు అవకాశం ఉంది.

కుంభ రాశి
ఈవారం శుక్రవారం ప్రయత్నకార్యముల యందు జయంనుపొందుతారు. బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు. ఇష్టమైన పనులను చేపడుతారు. శని,ఆదివారాల్లో బంధవుల గృహంలో సమయాన్ని గడుపుతారు,భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడం చేత సంతోషాన్ని పొందుటకు అవకాశం కలదు. సోమ,మంగళ వారాల్లో అనుకూలమైన ఫలితాలు కలుగుటలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. బుధ,గురువారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట పనుల పట్ల అవగాహన కలిగి ఉంటే ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. వారం ఆరంభంలో ఉన్న ఉత్సాహంను చివరి వరకు కొనసాగించుట మంచిది. ఆకరానంగా ఏర్పడు కలహములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విందులు వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు బంధుమిత్రులకు సమయాన్ని కేటాయించే అవకాశం కలదు.  

మీన రాశి
ఈవారం శుక్రవారం కుటుంభంలో నూతన మార్పుల గురుంచి ఆలోచన చేయకండి సర్దుకుపొండి. శని,ఆదివారాల్లో ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయగలరు. బంధువులతో నూతన ఆలోచన చేయుటకు అవకాశం ఉంది. సోమ,మంగళ వారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభంను పొందుతారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బుధ,గురువారాల్లో ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. బంధుమిత్రులతో చేపట్టిన పనులలో కొంత ఖర్చును కలిగి ఉంటారు. ఉద్యోగంలో నిదానంగా ఉండుట సూచన. అకారణంగా భీతిని పొందుతారు అనుకున్న స్థాయిలో ఇబ్బందిని పొందకపోవచ్చును. కొంత పనిలో నిదానం అవసరం. ఆలోచనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకొనే అవకాశం కలదు.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Bhagavantudichhina Konni Varalu