Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సొరపొట్టు కూర - పి. శ్రీనివాసు

Sora pottu koora

ముందుగా సొర చేపని ముక్కలుగా కోసుకొని ఉడికించుకోవాలి.  బాగా ఉడికిన తరువాత పై పొట్టు తీసెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు, పచ్చి మిరపకాయలు, జీలకర్ర కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి. కొన్ని పచ్చి మిరపకాయలు నిలువుగా తరిగి పెట్టుకోవాలి. చర్మం తీసేసిన సొర చేప ముక్కలలో పసుపు, కారం, ఉప్పు  వేసుకొని కలుపుకోవాలి.

బాణీ లో నూనె పోసుకొని కరివేపాకు వేసి, ముందుగా సిద్ధం చేసుకొన్న ఉల్లి, వెల్లుల్లి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగాక అందులో సొర చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని, అందులో కొత్తిమీర, గరం మసాల వేసుకుని కొద్దిసేపు స్టవ్ పై ఉంచుకోవాలి.  నోరూరించే సొరపొట్టు కూర తయారు.

 

 

మరిన్ని శీర్షికలు