Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anupama got lucky chanse

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌: 2017పైనే ఆశలన్నీ

.tollywood

9 ఏళ్ళ విరామం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' 2017 సంక్రాంతికి విడుదలవుతుంది. బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' కూడా సంక్రాంతికే లాక్‌ చేశారు. అలా 2017 తొలి నెలలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలవుతాయి. పవన్‌ నటిస్తున్న 'కాటమరాయుడు', మహేష్‌ నటిస్తున్న 'సంభవామి' చిత్రాలు 2017లో అభిమానుల్ని అలరించనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ముందు వరుసలో నిలిచే 'బాహుబలి-2' కూడా 2017లోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఫస్టాఫ్‌కి ఖరారైన సినిమాలు ఇవన్నీ. సెకెండాఫ్‌లో వచ్చే సినిమాలు వీటికి అదనం. ఇంతకు ముందెన్నడూ లేనంత అద్భుతంగా 2017 గురించి సినీ అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా గత రికార్డుల్ని బ్రేక్‌ చేసే చిత్రాలు ఈ ఏడాదిలో రాబోతున్నాయి మరి. 2016లో సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోల చిత్రాల వెయిట్‌లో ఈక్వెల్‌ ఈక్వెల్‌ బ్యాలెన్స్‌ అయ్యింది దాదాపుగా. కానీ 2017 విషయానికొస్తే అలా కాదు. సీనియర్లు ఎక్కువగా పోటీ పడుతున్నారు. టాలీవుడ్‌ సినిమాకి గత వైభవం తిరిగి రానుంది 2017లోనే. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్‌ ముఖానికి రంగు వేసుకోవడం మెయిన్‌ ఎలిమెంట్‌గా చెప్పుకోవచ్చు. దీంతో టాలీవుడ్‌ సినిమాకి అసలు సిసలైన పోటీ ఇక్కడితోనే స్టార్ట్‌ అయ్యింది. అంతేకాదు సీనియర్లు చిరు, బాలయ్యలతో పాటు, నాగార్జున, వెంకటేష్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఇలా అంతా ఈ సంవత్సరం తమ సినిమాలతో అభిమానులకి కొత్త ఉత్సాహం ఇవబోతున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
vinayak act  in kaidi no 150 movie