Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadi no 150 movie ready to release

ఈ సంచికలో >> సినిమా >>

హిట్టు కొట్టాడు, రూటు మార్చాడు

nara rohit  rout change

ఓ ప్రయోగం అతనికి మంచి విజయాన్ని అందించింది. 'బాణం' సినిమా తర్వాత అంతలా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా బహుశా 'అప్పట్లో ఒకడుండేవాడు' అయి ఉండొచ్చు నారా రోహిత్‌కి. మధ్యలో కమర్షియల్‌ టచ్‌ ఉన్న సినిమాలు, ఆలోచనాత్మక సినిమాలు చేసినా, 'అప్పట్లో ఒకడుండేవాడు' అతనిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. హీరోనా? విలనా? అనే సందేహం ఆద్యంతం కలిగేలా నారా రోహిత్‌ పాత్ర ఇందులో తీర్చిదిద్దబడింది. అలాగే శ్రీవిష్ణు పాత్ర కూడా. ఎవరు హీరో? ఎవరు విలన్‌? అనే కన్‌ఫ్యూజన్‌ ఉంటూనే సినిమా అద్భుతంగా వచ్చింది. అలా నారా రోహిత్‌, తన బలమేంటో ఈ సినిమాతో బాగా తెలుసుకున్నాడు. ఇక నుంచి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఇంకా చేస్తానంటున్నాడు.

అంతే కాకుండా ఇదివరకటిలా ఒకదాని తర్వాత ఒక సినిమా ఒప్పేసుకుని, గందరగోళంలో పడటం కన్నా ఒక సమయంలో ఒక సినిమా చేస్తూ, దాని మీదనే ఫోకస్‌ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇది మంచి ఆలోచనే. ఈ ఏడాది నారా రోహిత్‌ నుంచి రాబోయే తొలి సినిమా 'కథలో రాజకుమారి'. ఇది కూడా విలక్షణ కథాంశంతో రూపొందిన చిత్రమని నారా రోహిత్‌ అంటున్నాడు. హీరోగా నటిస్తూనే, ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడూ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటానని నారా రోహిత్‌ చెప్పాడు. విలక్షణ సినిమాల ఎంపికలో తనదైన ముద్ర వేసే నారా రోహిత్‌ నిర్మాతగా రాణిస్తే, కొత్త దర్శకులకు అతను హెల్పింగ్‌ హ్యాండ్‌ అవుతాడనడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam