Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
apps apps

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 
 
1. అది అమెరికా దేశ అంతర్గత నిర్ణయమే అయినా భారతీయుల్ని విసా ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. అమెరికా నిర్మాణంలో భారతీయ ప్రతిభ ఎంతో ఉంది. భారతీయులుగా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు స్వాగతించలేం. 
 
2. భారతదేశం నుంచి వలస పోతున్న నిపుణులను చూసి, ఆ పరిస్థితికి "బ్రెయిన్ డ్రెయిన్" అని పేరు పెట్టి తెగ బాధపడిపోయాం. అలా అమెరికాకి వలస పోకుండా ఉంటే మన దేశం స్థితిగతులు ఇంకా మెరుగ్గా ఉండేవని తెగ వ్యాసాలు రాసాం. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మన బాధకి సమాధానంలా ఉంది. వలసలు ఆపే విధంగా తీసుకున్న విసా నిర్ణయం వల్ల భారతదేశంలో "బ్రెయిన్ డ్రెయిన్" జరగదు. ఇక్కడి నిపుణులు ఇక్కడే ఉంటారు. దేశాన్ని అమెరికా అంత గొప్పగా మారుస్తారు. కనుక ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించాలి. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
weekly horoscope 3rd febuary to 9th febuary