Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
GHAZI movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిన్నదే, పెద్ద ఛాన్స్‌ కొట్టేసింది

rituvarma got bumper offer

సినిమాల్లో హీరోయిన్‌ చెల్లెలిగా ఇంకా చిన్న చిన్న పాత్రల్లోనూ నటించిన రీతూ వర్మ ఒక్కసారిగా బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఆ ఛాన్స్‌ బంపర్‌ ఛాన్స్‌ అని ఆ సినిమా విజయవంతమయ్యేదాకా ఆమెకు తెలియదు. అదే 'పెళ్ళిచూపులు' సినిమా. అందులో హీరోయిన్‌గా నటించిన రీతూ వర్మకి వెంటనే దశ తిరిగిపోలేదు. కానీ ఆమె పేరు మార్మోగిపోయింది తెలుగు సినీ పరిశ్రమలో. చాలా చిన్న సినిమాగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించడంతో ఆ సినిమాలో నటించిన హీరోతోపాటు, హీరోయిన్‌కి కూడా పెద్ద గుర్తింపు లభించింది.

ఈ జోష్‌లో హీరో విజయ్‌ దేవరకొండ ఛాన్సుల మీద ఛాన్సులు దక్కించుకుంటోంటే, రీతూ వర్మకి 'వజ్రం' లాంటి ఛాన్స్‌ దొరికింది. అదేమిటంటే తమిళ హీరో విక్రమ్‌ సరసన హీరోయిన్‌గా నటించడం. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటించనుంది. సాధారణంగా గౌతమ్‌ మీనన్‌ సినిమాల్లో హీరోయిన్‌ కొంచెం టిపికల్‌గా ఉంటుంది. అంత టిపికల్‌ పాత్రకి రీతూ వర్మని ఎంపిక చేయడమంటే, ఆమెలో చాలా టాలెంట్‌ ఉండి ఉండాలి. తెలుగు తెరపై రీతూ వర్మ టాలెంట్‌ని పూర్తిస్థాయిలో చూసే చిత్రం రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్‌తో గౌతమ్‌ మీనన్‌ రూపొందించనున్న సినిమాలో రీతూ వర్మ నట విశ్వరూపం చూసేందుకు అవకాశముంది. ఆల్‌ ది బెస్ట్‌ టు రీతూ వర్మ. 

మరిన్ని సినిమా కబుర్లు
march 3rd gunturodu movie  release