Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu..aame..oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

http://www.gotelugu.com/issue205/586/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

 
( గతసంచిక తరువాయి )....

“రాజేంద్ర మరణాన్ని ఆత్మహత్యగా ధృవీకరిస్తున్న సూసైడ్ నోట్ నువ్వు చూసావా?”

“లేదు. అవి మా కస్టడీలో ఉన్నాయి కానీ నేను దాన్ని చూడలేదు”

“నిన్న మీ  క్లూస్ టీమ్ దగ్గరకి వెళ్ళినప్పుడు నేను దాన్ని క్యాజువల్‍గా చూసాను. నాకేదో అనుమానం వచ్చి, సీల్డ్ కవర్లోంచి బయటకి తీసి పరిశీలనగా చూసాను. జాగ్రత్తగా గమనిస్తే, ఆ నోట్ మీద పౌడర్లా అంటి పెట్టుకుని ఏదో కెమికల్ ఉన్నట్టు కనిపించింది. ఆ కెమికల్ ఏమిటా అని పరిశీలించడాన్కి ప్రయత్నించాను కానీ నాకు తెలియలేదు”

“ఓహ్...అయితే, ఆ సూసైడ్ నోట్ నిజమైనది కాదన్నమాట? ఇన్ని ఆధారాలు దొరికాక ఇంకా దేనికి తాత్సారం చేస్తున్నావు?   అనుమానితులని  అదుపులోకి తీసుకుని విచారణ జరిపించచ్చు కదా?  ఆదేశాలు ఇవ్వమంటావా?”

 “ఎవరిని విచారించమంటావు?”

“ముందుగా విచారించాల్సింది సురేష్ వర్మని.  ఎందుకంటే, రాజేంద్ర మరణిస్తే అందరికన్నా అతడికే ఎక్కువ లాభం. హత్య చెయ్యడానికి అందరికన్నా మోటివ్ అతడికే ఎక్కువ ఉంది. వంటవాడు నరసింహ చెప్పినదాన్ని బట్టి చూస్తే, పెద్ద రాజాగారు, అతడు కుమ్ముక్కై అతడ్ని హత్య చేసారని కూడా అనుమానించచ్చు. అందుకే పెద్దరాజా గార్ని కూడా విచారించాలి”  ఆవేశంగా అన్నాడు ప్రసాద్.

“వీటన్నింటికన్నా ముందు అసలు రాజేంద్రది ఆత్మహత్య కాదు హత్య అని మనం నిరూపించగలగాలి.  అలా నిరూపించాలంటే  ముందు సూసైడ్ నోట్ ఫేక్ అని తేలాలి.  ఒకసారి ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఆ నోట్ ని పంపించి, దాని మిద ఉన్న కెమికల్ ఏమిటో తెలుసుకోండి.  రాజేంద్ర అక్కౌంటు ఉన్న బ్యాంకు నుంచి స్పెసిమన్ సిగ్నేచర్స్ తెప్పించి అది అతడి సంతకమో కాదో కూడా నిర్ధారణ చెయ్యండి. నోట్ మీద రాసి ఉన్న మేటర్ తాలూకూ ఇంకూ, సంతకం ఉన్న ఇంకూ ఒకటో కాదో  చెక్ చెయ్యండి.”

“ష్యూర్.  ఈ వివరాలు తెలుసుకుని నీకు వెంటనే తెలియ చేస్తాను” అన్నాడు ప్రసాద్.

“అన్నింటికన్న మరో ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి”  ప్రసాద్ ఫోన్ పెట్టేయ్యబోతుంటే అన్నాడు పాణి.

“ఏమిటది?”

“ఈ కేసులో ఒకవేళ విచారణ అంటూ చెయ్యాల్సివస్తే, విచారించాల్సిన వ్యక్తులలో ఇంద్రనీల కూడా ఉంటుంది!”

“వాట్?!”  అదిరిపడ్డట్టుగా అన్నాడు ప్రసాద్.

“అవును. ఆమె ఇన్ఫ్ల్యుయెన్సు చేయించుకుని మరీ ఇక్కడికి పోస్టింగ్ వేయించుకుని వచ్చినది వెనుక బడిన జిల్లా  ప్రజలకి సమాజ సేవ చెయ్యాలని కాదు.  ఈ కేసు మీదా, ఈ రాజమహల్ మీదా ఆమెకేదో  ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆమె ఇక్కడికి వచ్చినది  ఆ పర్పస్‍తోనే”

“అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు?”

“ఐస్ రీడింగ్. కళ్ళు  చూసి, కనుగుడ్ల కదలికలని బట్టి ఎదుటి మనిషి మనసులోని భావాలని కనిపెట్టకల ఐ రీడింగ్ నాకు తెలుసని తెలుసు కదా?  నేను డిటెక్టివ్‍నని చెప్పగానే సురేష్ వర్మ కనుగుడ్ల కదలికలని బట్టి అతడు భయపడుతున్నాడన్న విషయాన్ని గ్రహించాను.  అలాగే, బంగళాలో తిరుగుతున్నప్పుడూ, నాతో మాట్లాడుతున్నప్పుడూ ఇంద్రనీల కళ్ళల్లో ఏదో ‘అన్వేషణ’  కనిపిస్తోంది. దాన్ని బట్టే  చెబుతున్నాను”

“అది కేవలం  అంచనా మాత్రమే.  అంచనాలు అన్ని వేళలా నిజం కాకపోవచ్చు కూడా కదా?”

పాణి నవ్వాడు “నా అంచనా ఎప్పుడూ తప్పదు.  చనిపోయిన  రాజేంద్ర గదిలో మీ క్లూస్ టీమ్ మొత్తం ఇరవై నాలుగు  ఆధారాలని సేకరించారు.  కానీ మీ దగ్గరకి కస్టడీలోకి ఇరవై మూడు ఆధారాలే వచ్చాయి.  ఆ మిస్సైన  నెంబర్ గల ఆధారం ఇంద్రనీల దగ్గర ఉంది.  కావాలంటే చెక్ చేసుకోండి. ఈ కేసులో ఏ ఆసక్తీ లేకపోతే ఆ ఆధారాన్ని ఆమె ఎందుకు మిస్ చేస్తుంది?  ఇక్కడికి రాగానే ఇంద్రనీల కళ్ళలో అన్వేషణని చూసాను. మధ్యాహ్నం క్లూస్ టీమ్‍తో మాట్లాడాక మిస్సైన ఆధారం గురించి తెలిసింది. వాళ్ళు మాత్రం పొరపాట్న  ఒక నెంబర్ స్కిప్ చేసామని అనుకుంటున్నారు”

ఒక్క క్షణం ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు “అనుమానం ఉన్నప్పుడు డిపార్టుమెంట్ మనుషులనైనా సరే విచారించాల్సిందే. అందుకు అభ్యంతరం లేదు.  చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు” అన్నాడు

“ఏమిటది?”

“సురేష్ వర్మ కళ్ళల్లో భయం చూసానన్నావు. ఇంద్రనీల కళ్ళల్లో అన్వేషణ చూసానన్నావు.  మరి రాజేంద్రవర్మ తాతగారు అదే, పెద్ద రాజా వారి కళ్ళల్లో ఏం చూసావు?”

“నాకు ఆయన కళ్ళల్లో భయం, బాధ  ఇవేమీ కనబడలేదు.  మనవడ్ని తల్చుకుంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో  ప్రస్ఫుటంగా కనబడిన ఒకే  ఒక్క భావం... పశ్చాత్తాపం!”

“ఇంత చిక్కుముడిలా ఉన్న ఈ కేసుని నువ్వెలా సాల్వ్ చేస్తావో చూడాలని ఉత్సుకతగా ఉంది పాణీ.  సూసైడ్ నోట్‍ని ఫోరెన్సిక్ ల్యాబ్‍కి  పంపి నువ్వు అడిగిన సమాచారం వెంటనే తెప్పిస్తాను.  కనీసం దానితోనైనా ఈ చిక్కుముడి కొంత వరకూ విప్పుకుంటుందని ఆశిద్దాం”  అన్నాడు ప్రసాద్.

అయితే, ఆ ఫోరెన్సిక్ రిపోర్టు వల్ల చిక్కుముడి విప్పుకోక పోగా మరింతగా బిగుసుకుంటుందని ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ తెలియదు!

***

కల కన్నా వాస్తవం
బాగుండడమే
ప్రేమ !!

***

పిచ్చి  కాకపోతే
అసలు అది ప్రేమే కాదు!

***

నీ నడుమ్మీద ఉన్న పుట్టుమచ్చ
కోహినూర్ వజ్రం కన్నా విలువైనది !

 ***

ఆఛ్చాదనలేని నా గుండెల మీద
నీ  వెచ్చని ఊపిరి స్పర్శ కోసం
జీవితాన్ని రాసిచ్చెయ్యమన్నా రాసేస్తాను !

***
ప్రేమకీ శృంగారానికీ తేడా ఏమిటంటే
శృంగారం   ఒత్తిడిని తగ్గిస్తుంది
ప్రేమ పెంచుతుంది !

***
నిద్దట్లో నీ మెడ చుట్టూ చెయ్యి వేసినప్పుడు
కొద్ది సేపటికి ఆ చేతికి క్రింద వక్షోజాల మెత్తని స్పర్శ తగలడం
జీవితంళో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి!!

***
జరిగిన కథ
మరిన్ని సీరియల్స్