Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hats off to balakrishna

ఈ సంచికలో >> సినిమా >>

50 కోట్లు 'ఫిదా' అవుతుందా!

fida movie cross 44 crores

పెద్ద నిర్మాతలైతే మాత్రం పెద్ద పెద్ద సినిమాలే తియ్యాలనే రూల్‌ ఏమీ లేదు. కమర్షియల్‌ హంగులతో హీరో స్టామినాని మించిన సినిమాలు తీసి, చేతులు కాల్చుకోవడం మామూలే. ఒక్కోసారి పెద్ద సినిమాలు విజయాలు సాధించినా, తద్వారా నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు వస్తున్న సందర్భాలూ తక్కువే. అందుకే పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలవైపు చూస్తున్నారు. అలా పెద్ద బ్యానర్ల నుంచి వచ్చిన చిన్న సినిమాలు అద్భుత విజయాల్ని అందుకుంటున్నాయి. నిర్మాత దిల్‌ రాజు కూడా అలాగే ఆలోచించారు. వరుణ్‌ తేజతో పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ తియ్యాలనుకోలేదు, కొత్త ప్రయోగం చేశారాయన. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' అనే సినిమా తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండడమే 'ఫిదా' సక్సెస్‌కి కారణం. మామూలుగా ఈ సినిమా నిర్మాతకి మోస్తరు లాభాలు తెచ్చిపెట్టవచ్చునని అంతా అనుకున్నారు.

అయితే పెద్ద సినిమాలకు ధీటుగా 'ఫిదా' వసూళ్ళను సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. 44 కోట్లు దాటి, 50 కోట్లకు 'ఫిదా' వసూళ్ళు చేరనున్నాయంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. మంచి సినిమా తీయాలనే స్వార్ధం తప్ప, ఇంకే స్వార్ధమూ 'ఫిదా' దరిచరలేదు. హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాత ఇలా ప్రతి ఒక్కరూ 'నిజాయితీ'తో చేసిన సినిమా 'ఫిదా'. అదే ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించింది. 50 కోట్లు అనే మైలు రాయిని ఫిదా చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఓవర్‌సీస్‌లో అయితే పెద్ద పెద్ద సినిమాలకే 'ఫిదా' షాక్‌ ఇచ్చిన వైనం అభినందనీయం. 

మరిన్ని సినిమా కబుర్లు
sai dharamtej tripul dhamakha