Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Student world that wants to change

ఈ సంచికలో >> యువతరం >>

ఉపాధి మాత్రమే కాదు - అంతకు మించి

Not only employment

ఉన్నత చదువుల కోసం తగిన ఆర్థిక స్థోమత లేనప్పుడు ఏం చేస్తాం? ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు ఆలోచిస్తాం. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం గురించే ముందుగా యువతరం ఆలోచిస్తుంటుంది. అయితే అది కూడా ఇప్పుడు పాత మాటగా మారిపోయింది. ఏదో ఓ చోట ఉద్యోగం చేయడం కాదు, మనమే మన టాలెంట్‌తో ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడం, ఆ మార్గంలో పది మందికి ఉపాధి కల్పించడం ఇప్పుడు న్యూ ట్రెండ్‌. స్కూల్‌ డేస్‌ నుంచే పిల్లల ఆలోచనలు రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. ఉపాధి మార్గాలకు ఇప్పుడు కొదవ లేదు. అయితే ఆ ఉపాధి మార్గాల్లోంచే, ఉపాధి కల్పన అనే గొప్ప ఆలోచన పుట్టుకొస్తోంది. పదో తరగతి పాసైన కుర్రాడు కూడా ఈ రోజుల్లో పది మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాడంటే పిల్ల మెదళ్ళు ఎంత వేగంతో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మెదడు పాదరసం కంటే ఎక్కువ వేగంతో పనిచేయడమంటే ఇదే. 

మరి పిల్లలు అంత షార్ప్‌గా ఆలోచిస్తోంటే, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏమీ చేయకపోయినా ఫర్లేదు, వారి ఆలోచనలకు అడ్డుపుల్ల మాత్రం వేయకూడదు. సన్మార్గంలో పిల్లలు నడుస్తున్నప్పుడు వారిని వారించాల్సిన పనేలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పడం, చేతనైతే 'ఈ మార్గంలో ఆలోచించి చూడు, ఇంకాస్త బెటర్‌ రిజల్ట్‌ వస్తుంది' అని ప్రోత్సహించడం ద్వారా తల్లిదండ్రులు, తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే కాదు, పిల్లల దృష్టిలో మంచి మార్కులు కూడా సంపాదించుకోగలుగుతారు. ఫొటోగ్రఫీ కావొచ్చు. సోషల్‌ మీడియా ద్వారా సందేశాత్మక వీడియోలు చిత్రీకరించడం కావొచ్చు, వెడ్డింగ్‌ ప్లానింగ్స్‌ కావొచ్చు, ఇంకేమైనా క్రియేటివ్‌ థింకింగ్స్‌ కావొచ్చు యువత ఆలోచనలకు ఆకాశమే హద్దు అయిపోయిందిప్పుడు. ఒక్కసారి యూ ట్యూబ్‌లోకి వెళితే, ప్రపంచం మన చేతుల్లోనే ఉంటోంది. దాంట్లోంచి మంచిని వెతుక్కోవడమే ముఖ్యమిక్కడ. ఓ ఆలోచన మనసులో రాగానే, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్‌లో, ముఖ్యంగా యూ ట్యూబ్‌లో దొరికేస్తోంది. 

అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడాలేమీ ఇక్కడ ఉండవు. ఎవరి ఆలోచనలకు తగ్గ సమాచారం వారికి ఏదో ఒక రకంగా అందుబాటులోకి వచ్చేస్తుండడంతో ఆదాయార్జన చిన్న తనం నుంచీ పిల్లలకు అలవాటవుతోంది. దాన్ని వారు సన్మార్గంలో ఉపయోగించుకునేలా పిల్లల్ని తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. ఒక్కసారి ఆర్జన మొదలయ్యాక, పదిమందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఎవరికీ విశదీకరించి చెప్పాల్సిన పని ఉండదు. ఏదేమైనా ఉరకలెత్తే ఉత్సాహం ముందు ప్రపంచం చాలా చిన్నదైపోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మరిన్ని యువతరం