Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ajnatavasi tittle fix

ఈ సంచికలో >> సినిమా >>

సప్తగిరి అందర్నీ చక్కబెట్టేస్తున్నాడు

saptagiri LLB movie released on december 7th

కమెడియన్‌ నుండి హీరోగా అవతారమెత్తిన సప్తగిరి రెండో సినిమా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఈ సినిమాకి స్టార్స్‌తో ప్రమోషన్‌ భలే చేయిస్తున్నాడు సప్తగిరి. ఈ సినిమా ట్రైలర్‌ లాంఛింగ్‌ని ఏకంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా చేయించాడు. ట్రైలర్‌ చాలా బాగుందనీ, చాలా రిచ్‌గా సినిమా ఉండబోతోందనీ, సినిమాలో సప్తగిరి డాన్సులు, ఫైట్లు బాగా చేశాడనీ రామ్‌ చరణ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశాడు. రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయడం సప్తగిరికి బాగా కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. గతంలో తొలి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఆడియో ఫంక్షన్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా వచ్చాడు. అలా తన సినిమాలకు మెగా ఫ్యామిలీ అండ దక్కుతోంది సప్తగిరికి. మెగా ఫ్యామిలీకి డై హార్ట్‌ అభిమాని సప్తగిరి. ఇదిలా ఉండగా తాజా సినిమా ఆడియో సింగిల్స్‌ని ఒక్కో స్టార్‌తో విడుదల చేయిస్తున్నాడు. తొలి సాంగ్‌ని డైరెక్టర్‌ వినాయక్‌తో రిలీజ్‌ చేయించాడు.

సాంగ్‌ విడుదల చేసి వినాయక్‌, సప్తగిరి డాన్సులు బాగా చేశాడు. అసలింత డాన్స్‌ సప్తగిరి ఎప్పుడు నేర్చేసుకున్నాడో నాకు తెలీదు అంటూ ప్రశంసించాడు. అలాగే రెండో సాంగ్‌కి జవాన్‌ సాయి ధరమ్‌ తేజ్‌ హస్తం పడింది. తేజు చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్‌ సాంగ్‌ విడుదల చేయించాడు. ఇక ముచ్చటగా మూడో సాంగ్‌ని నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశాడు. మూడో సాంగ్‌ని విడుదల చేస్తూ నాని ఏమన్నాడంటే.. సప్తగిరి నాకంటే ముందే వచ్చేస్తున్నాడు. హమ్యయ్యా నాకు టెన్షన్‌ లేదన్నాడు కొంటెగా.. ఆ రకంగా సప్తగిరి స్టార్స్‌ అందర్నీ చక్కబెట్టేస్తున్నాడు వరుసగా. చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' డిశంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
sarvanand  looks  like gangstar in next movie