Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nani double dhamakha

ఈ సంచికలో >> సినిమా >>

'అజ్ఞాతవాసి' అదరగొట్టేసిన అనిరుధ్‌

anirudh created sensation as ajnatavasi

'గాలి వాలుగా గులాబి వాలి..' ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ పాటే. ఎక్కడ విన్నా ఈ పాటే. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమాలోని సెకండ్‌ ఆడియో సింగిల్‌ ఇది. ఇటీవలే రిలీజైంది. ఈ పాటకు ట్యూన్‌ కట్టింది యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌. ఈ ఆడియోతోనే అనిరుధ్‌ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. వస్తూ వస్తూనే ఓ సంచలనంలా దూసుకొస్తున్నాడు. తొలి ఆడియో సింగిల్‌ 'బైటికొచ్చి చూస్తే.. ' ఓ ఊపు ఊపేసింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్థుల్ని ఊయలలూగించేసింది ఈ సాంగ్‌. ఇప్పుడు రొమాంటిక్‌ ప్రియుల్ని కట్టి పడేస్తోంది. గాలి వాలుగా.. అంటూ ఏదో కొత్త లోకంలోకి తీసుకెళ్లిపోతోంది ఈ సాంగ్‌.

ఈ సాంగ్‌ ట్యూన్‌ కట్టడం ఓ ఎత్తైతే, మనోడు ఈ పాట కోసం ఓ స్పెషల్‌ వీడియోని కూడా రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోకి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఆ వీడియోలో కనిపించేది ఎవరనుకుంటున్నారా? అనిరుధ్‌. అనిరుధ్‌ స్వీట్‌ స్వీట్‌గా స్టెప్పులేస్తూ, పాటనాలపిస్తుంటే, ఓ తెలియని కొత్త ఫీలింగ్‌. ఆ ఫీలింగ్‌ చాలా బాగుంది. ఈ వీడియోతో గాలి వాలుగా.. పాటకి మరింత క్రేజ్‌ వచ్చేసింది. తెలుగులో ఇలాంటి వీడియోలు రాకింగ్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చేస్తుంటాడు. 'జులాయి' సినిమా కోసం పకడో పకడో అంటూ ఓ సాంగ్‌ వీడియోని ఇలాగే స్పెషల్‌గా చిత్రీకరించాడు దేవిశ్రీ ప్రసాద్‌. ఆ సాంగ్‌లో దేవి స్టెప్పులు అలాగే ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అదే స్టైల్‌ని కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ కొనసాగిస్తున్నట్లుగా ఉంది. ఎంట్రీతోనే స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు ఈ కొలవెరి కుర్రోడు. వస్తూ వస్తూనే రెండు పెద్ద సినిమాలకు ఛాన్స్‌ దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకీ మ్యూజిక్‌ అందించేది అనిరుధే కావడం విశేషం. 

మరిన్ని సినిమా కబుర్లు
no breaks for trivikram speed