Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gehana in nude

ఈ సంచికలో >> సినిమా >>

హీరోయిన్ వేటలో నీలకంఠ

neelakanta in searching of heroine

'మిస్సమ్మ' సినిమాతో సంచలన దర్శకుడిగా వార్తల్లోకెక్కిన నీలకంఠ, ఆ తర్వాత కూడా తనదైన జోనర్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండానే, తన ప్రత్యేకతను నీలకంఠ చాటుకుంటున్నారు. ఆయన సినిమాల్లోని కథాంశం ఎప్పుడూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే వుంటోంది.

ఇప్పుడాయన ఓ కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు 'మాయ'. ఇంకా సినిమా చర్చల దశలోనే వుంది. తన సినిమాలో ప్రధాన పాత్ర కోసం హీరోయిన్ అన్వేషణలో వున్నారు నీలకంఠ. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట.

కథ, కథనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే నీలకంఠ, 'మాయ' సినిమానీ అదే శ్రద్ధతో తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాలు హీరోయిన్ విషయం తేలాక వెల్లడవుతాయి.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam