Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిన్న అల్లుడి కోసం మెగా స్కెచ్‌

Mega sketch for small son in law

మెగా కాంపౌండ్‌ నుండి ఇంతవరకూ చాలా మంది హీరోలే వచ్చారు. హీరోలుగా టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఆ కోవలో మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో కళ్యాణ్‌ దేవ్‌. ఈ కళ్యాణ్‌ అక్షరాలా చిరంజీవికి అల్లుడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త. గత కొంతకాలంగా కళ్యాణ్‌ సినీ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటన, డాన్సులు తదితర అంశాల్లో కళ్యాణ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. చిరంజీవి దగ్గరుండి కళ్యాణ్‌కి శిక్షణ ఇప్పించారట. బాడీ బిల్డంగ్‌ నుండి, యాక్టింగ్‌ స్టైల్‌ ..ఇలా తదితర అంశాల్లో చిరంజీవి, అల్లుడు కళ్యాణ్‌కి కొన్ని సూచనలు చేశారట. ఇటీవలే కళ్యాణ్‌ డెబ్యూ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే ది గ్రేట్‌ డైరెక్టర్‌ రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం కీరవాణి, ఇంకా పలువురు ప్రముఖులు విచ్చేసి, కళ్యాణ్‌ని ఆశీర్వదించారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో వారాహి బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రాకేష్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ భారీ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి' అంతటి ఘన కీర్తి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ది గ్రేట్‌ కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌ ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం. అలాగే 'రంగస్థలం' సినిమాకి అద్భుతమైన సెట్స్‌ వేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట ప్రొడ్యూసర్‌ సాయి కొర్రపాటి. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ మాళవికా నాయర్‌, కళ్యాణ్‌తో జత కడుతోంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కళ్యాణ వైభోగమే' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది మాళవికా నాయర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
Boxing Waiting for Collection King