Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

పెళ్లికి సై అనేసిన అందాల శ్రియ

shriya ready to marriage

ముద్దుగుమ్మ శ్రియ పెళ్లి వార్తలు గత కొంత కాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. మొన్నీ మధ్య స్నేహితురాలి పెళ్లికి సంబంధించిన షాపింగ్‌లో శ్రియ కనిపించిందనీ, ఇంకేముంది శ్రియ పెళ్లి చేసేసుకుంటోంది, ఆల్రెడీ పెళ్లి షాపింగ్‌ కూడా చేసేస్తోందంటూ గాసిప్స్‌ చక్కర్లు కొట్టేశాయి. అయితే అది తన పెళ్లి కాదనీ, స్నేహితురాలి పెళ్లి అనీ శ్రియ తర్వాత కూల్‌గా చెప్పేసి ఊరుకుంది, తన పెళ్లి మాట చెప్పకుండా. కానీ శ్రియ గత కొంతకాలంగా రష్యాకి చెందిన క్రీడాకారుడు, పారిశ్రామిక వేత్త అయిన ఆండ్రీ కొచ్చీవ్‌తో లవ్‌లో ఉన్న మాట వాస్తవమేననీ, ఆయన్నే త్వరలో శ్రియ పెళ్లి చేసుకోబోతోందంటూ తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ సారి శ్రియ పెళ్లి వార్త నిజమేనని తెలుస్తోంది. అతి త్వరలోనే శ్రియ వివాహం జరగనుందట. శ్రియ అత్యంత సన్నిహితులకు, స్నేహితులకు ఆల్రెడీ పెళ్లి బురు కూడా అందినట్లు సమాచారమ్‌. మరో పక్క శ్రియ ఇప్పుడేమంత ఖాళీగా లేదండోయ్‌. ఎంతమంది కొత్త భామలు వచ్చినా శ్రియకి వస్తున్న భారీ ఆఫర్లు తగ్గడం లేదు. ఈ మధ్య శ్రియ స్టార్‌ హీరోలకు మొదటి ఆప్షన్‌గా మారింది. బాలయ్యతోనే రెండు సినిమాల్లో నటించింది. బాలయ్య - శ్రియ నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా మంచి విజయం అందుకుంది. నాగార్జునతో సూపర్‌ హిట్‌ మూవీ 'మనం'లో నటించింది. 'ఊపిరి'లో గెస్ట్‌ రోల్‌లో కనిపించింది. తాజాగా వెంకటేష్‌ - తేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి శ్రియని హీరోయిన్‌గా ఎంచుకున్నారట. గతంలో వెంకీతో 'గోపాల గోపాల' చిత్రంలో నటించింది శ్రియ. తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో కూడా శ్రియ నటిస్తోంది. ఇలా శ్రియ హీరోయిన్‌గా కెరీర్‌ హైప్‌లో ఉన్నప్పుడే పెళ్లి కబురు చెప్పడం విశేషమే. 

మరిన్ని సినిమా కబుర్లు
bharat anu nenu ovie created sensation