Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Vimarsa - Randhranveshana

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (అక్టోబర్ 11 - అక్టోబర్ 17) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాల్లో మరొక ప్రదేశంలో నివసించ వలసి రావచ్చును, కలహములకు దూరంగా ఉండుట మేలు. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోక పోవడం వలన మేలుజరుగుతుంది. ఆది, సోమవారాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభిచుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు, పనులలో జయం ఉంటుంది. నూతన పనులను ఆరంభించుట చేత లాభంను కలిగి ఉంటారు. మంగళ, బుధ వారాల్లో బంధువులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. భోజన సౌఖ్యం కలుగుతుంది. బంధువులతో కలిసి ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబంలో మంచి ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. గురువారం అధికమైన ఆలోచనలు చేస్తారు. వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. వారం మొత్తం మీద చేపట్టిన ప్రయత్నాలలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటవి. ఉద్యోగంలో మాత్రం కొంత నిరాశను పొందుతారు. కావున తొందరపాటు నిర్ణయాలు వద్దు. సోదరుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందక పోవచ్చును. సమయానికి భోజనం చేయుప్రయత్నం చేయండి. కుటుంబంలో నూతన నిర్ణయాలు చేయకండి. విద్యాసంభందమైన విషయాల్లో పాల్గొంటారు. విందులు, వినోదముల మూలాన ఖర్చును పొందుతారు.         

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఉద్యోగంలో సమయపాలనను పాటించుట మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. ఆది, సోమవారాల్లో ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. కుటుంబంలో కలుగు మార్పుల పట్ల ఎటువంటి స్పందన వ్యక్తపరచకండి. మిత్రులను కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. మంగళ, బుధవారాల్లో చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్ల గలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. గురువారం బంధువులతో కలిసి భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. వారం మొత్తం మీద చర్చాసంభందమైన విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండి వాటికి సమయాన్ని కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు పాటించుట మేలు. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చును వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. వారి మూలాన ధనవ్యయంను పొందుతారు. మొండితనంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో తలపెట్టిన పనుల మూలాన పేరును కలిగి ఉంటారు. నూతన పనులను ఆరంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. ఆది, సోమవారాల్లో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. అనుకోని ఖర్చులు కలుగుతాయి. నిదానంగా వ్యవహరించుట సూచన. మంగళ, బుధవారాల్లో కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుతాయి. కావున అవతలి వారి మాటకు విలువ నివ్వడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. గురువారం చేపట్టిన పనులలో లాభంను పొందుతారు. నూతన పనులను ఆరంభిస్తారు. వారం మొత్తం మీద గతంలో చేపట్టిన పనులకు సంభందించిన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది, నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. అధికారుల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. బంధువులకు సంబంధించిన పనులలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. దూరపు ప్రయాణాలు చేయకండి. ఆశుభవార్తను వినే అవకాశం ఉంది. మానసికంగా ధృడంగా ఉండుట మంచిది. 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాల్లో నూతన పనుల పట్ల ఉత్సాహంను కలిగి ఉంటారు. పెద్దల సూచనలతో పనిచేస్తే విజయాన్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయాలో బాగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఆది, సోమవారాల్లో నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో తప్పక లాభం ఉంటుంది. ఉద్యోగంలో బాగుటుంది. అధికారులకు అనుగుణంగా నడుస్తారు. మంగళ, బుధవారాల్లో అనుకోని ఖర్చులు పొందుతారు. వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అనారోగ్యసమస్యలు కలుగుతాయి. తగిన జాగ్రత్తలు పాటించుట మేలు. గురువారం పనులలో ఆటంకాలు కలుగుతాయి. పనులు నిదానంగా ముందుకు కదులుతాయి. కుటుంబంలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వారం మొత్తం మీద చేసిన ఆలోచనల మూలాన తోటివారు లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. స్నేహముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మూలాన కష్టాలు తగ్గుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు పొందుతారు. కుటుంబంలో కలహములు కలుగుటకు అవకాశం ఉంది. స్థానచలనం ఉండుటకు అవకాశం ఉంది, నచ్చని ప్రదేశంలో నివశించవలసి రావచ్చును. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారంలో నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. 
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అసౌఖ్యాన్ని పొందుతారు. ఆశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి . ఆది, సోమవారాల్లో పెద్దల సహకారంతో లాభంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. తలపెట్టిన పనులలో అనుకూలమైనా ఫలితాలు కలుగుతాయి. నూతన పనులను ఆరంభించుట మేలు. మంగళ, బుధవారాల్లో తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. సమాజంలో గుర్తింపును పొందుతారు సంతోషంగా గడుపుతారు. అధికమైన పనులను కల్గి ఉంటారు. గురువారం పని ఒత్తిడి మూలాన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అనుకోని ఖర్చులు కలుగుతాయి. వారం మొత్తం మీద ధార్మిక సంభందమైన పనులలో సమయాన్ని కేటాయించుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. కావున తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. చేపట్టినపనులు నిదానంగా పూర్తి అవుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో నూతన పనులను ఆరంభించక పోవడం ఉత్తమం. పెద్దల సూచనలు పాటించండి. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు, పనులలో ఆటంకాలు కలుగుతాయి, నూతన పనులను ఆరంభించక పోవడం సూచన. ఆది, సోమవారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. నిదానంగా ఉండుట మంచిది. ప్రయాణాలు చేయకండి. కోపాన్ని తగ్గించుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. మంగళ, బుధవారాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభించుట ఉత్తమం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట వలన లాభంను పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి అధికారులకు అనుగుణంగా పనులను చేపడుతారు. గురువారం పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారం మొత్తం మీద మంచివారితో మీకున్న పరిచయాల మూలాన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. మాటలను పొదుపుగా వాడుట సూచన. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. బంధుమిత్రులతో వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చును. సంచారం చేయవలసి రావొచ్చును ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యతిరేకవర్గం మూలాన శ్రమను ఇబ్బందులు పొందుతారు. 

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో నూతన పనులను చేపడుతారు. ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ఆది, సోమవారాల్లో పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత నిరుత్సాహంను పొందుటకు అవకాశం కలదు. కావున పనులలో తొందరపాటు పనికిరాదు. మంగళ, బుధవారాల్లో ఒకవార్త మీలో బాధను కలిగించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట అన్నివిధాల శ్రేయస్కరం. పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. గురువారం కొంతమేర పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. సంతోషంను పొందుతారు. వారం మొత్తం మీద నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మనోదైర్యంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాలు చేయుట మూలాన ఇబ్బందులు కలుగుతాయి. కలహములు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే ఆస్కారం కలదు వారికి అనుగుణంగా నడుచుకొనుట మంచిది.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాల్లో బంధువులతో కలిసి చేపట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి కాకపోతే కొంత నిదానం అవసరం. ఆది, సోమవారాల్లో అనుకోని ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు, తద్వార ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాలలో కూడా స్వల్ప సమస్యలు తప్పక పోవచ్చును. ఆలోచనలు పెరుగుతాయి వాటి మూలాన మానసికంగా ఇబ్బందులు పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వారితో కలిసి కొత్త కొత్త విషయల పట్ల ఆలోచన కలిగి ఉంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది ధనలాభం కలుగుతుంది. ఉత్సాహంను కలిగి ఉండి పనులలో సమయాన్ని గడుపుతారు. వారం మొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన పనులు ముందుకు కదులుతాయి. శుభాకార్యములలో సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. సమయానికి మాత్రం భోజనం చేయుట మంచిది. ధనం విషయంలో పెద్దల సలహాలను గౌరవించుట మేలు.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో పనులలో విజయాన్ని పొందుతారు. నూతన పనుల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యములు జరుగుటకు ఆస్కారం కలదు. ఆది, సోమవారాల్లో పనులలో వేగం మొదట ఉన్నంతగా ఉండకపోవచ్చును. పెద్దలతో కలిసి పనిచేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మంగళ, బుధవారాల్లో పనులలో అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. నూతన పనులను చేపడుతారు. కుటుంబంలో కొత్త కొత్త ఆలోచనలను చేస్తారు. గురువారం కొత్త పనులను వాయిదా వేయుట మంచిది. వారం మొత్తం మీద చేపట్టిన పనులలో లాభంను పొందుతారు. నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది పనులలో తొందరపాటు విధానం ఆవలంభించక పొతే మేలుజరుగుతుంది. పెద్దల ద్వార లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట చేయండి. రాజకీయవ్యవహారాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. అభీష్టకార్య సిద్ధిని కలిగి ఉంటారు.

మకర రాశి

ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అధికమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయుటకు అవకాశం కలదు. నూతన పనులను ఆరంభిచే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభాలను పొందుటకు అవకాశం ఉంది. మంగళ, బుధ వారాల్లో వ్యాపరంలో అశ్రద్ద చేసినచో నష్టపోయే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలను వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. మాటలను పొదుపుగా వాడుట అనేది సూచన. గురువారం పనులలో లాభంను పొందుతారు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులపైన శ్రద్ధను కలిగి ఉంటే సకాలంలో పూర్తిచేయ గలుగుతారు. ఆర్థికంగా అనుకోని ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండుట సూచన. ఎక్కువగా ఆలోచనలతో సమయాన్ని వృధాచేయుటకు అవకాశం కలదు జాగ్రత్త. అనుకోని వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు నిదానంగా వ్యవహరించుట మేలు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుటకు అవకాశం కలదు. నచ్చిన వారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానించుట ఉత్తమం.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధువులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో ఆలోచనలు పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ధననష్టం ఉండుటకు అవకాశం కలదు. పనులలో శ్రమను కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత పాటించుట మేలు. మంగళ, బుధవారాల్లో కొత్త కొత్త పనులను చేపట్టి వాటిలో విజయాన్ని పొందుతారు. నూతన పనులయందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. గురువారం కొంత విశ్రాంతిని కోరుకొనే అవకాశం కలదు. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన. వారం మొత్తం మీద బంధువులతో సమయాన్ని గడుపుతారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు, భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో కొంత అనుకూలమైన వాతావరణం కోసం ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. అధికారులతో మాత్రం విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ప్రాముఖ్యత కలిగిన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది.   

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో తలపెట్టిన పనులలో విజయాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు, మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు లాభంను పొందుటకు అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో పనులలో భారంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది. నూతన పనులను వాయిదా వేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. గురువారం నచ్చినవారిని కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో విజయాన్ని పొందుతారు. నూతన ప్రయత్నాలు ఆరంభించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. ఆలోచనల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. నచ్చిన పనులలో మిత్రులను కలుపుకొని ఆరంభించుట ద్వారా గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. మీ మాటలను కొంత మంది వ్యతిరేకించే అవకాశం కలదు. సర్దుబాటు విధానం అవసరం.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Book Review - pakisthan lo padi rojulu