Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue312/803/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి).....  “మీ నిర్ణయం మార్చుకోరా” అడిగాడు పాకిస్ధాన్ డిఫెన్స్ సెక్రటరి.
పాకిస్ధాన్ రక్షణ మంత్రి చిన్నగా నవ్వి ”ఇందులో మార్చుకోవటానికి ఏం లేదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం చాల మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని లోతుగా చూస్తే మీకు అసలు విషయం బోధపడుతుంది” అన్నాడు రక్షణ మంత్రి.
అది రక్షణమంత్రి చాంబర్స్. ఆయన ముందు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిన ఫైలు ఉంది. అందులో ఉన్న విషయాలను చదివి రక్షణ మంత్రి ముందు ఆశ్చర్య పోయాడు. తరువాత ఆనంద పడ్డాడు. ఇలాంటి సమయం కోసమే ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అది ఇన్ని రోజులకు నెరవేరింది. ఫైలు చదవగానే అయన ఒక వ్యక్తి పర్సనల్ ఫైలు తెప్పించుకున్నాడు. దాన్ని కూలంకషంగా చదివాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు.

తన నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తుందని ఆయనకు తెలుసు. కాని ఆయన వెనుకడుగు వెయ్యదలుచుకో లేదు. అందుకే తన నిర్ణయం చెప్పటానికి డిఫెన్స్ సెక్రటరిని తన చాంబర్స్ కు పిలిపించాడు.

ఆయన అసలు విషయం చెప్పగానే డిఫెన్స్ సెక్రటరి అదిరి పడ్డాడు. ఇది నిజమా అన్నట్టు మంత్రి వైపు చూశాడు. దానికి కారణం లేక పోలేదు. ఇంకో నెల రోజులలో భారత్ పాకిస్ధాన్ దేశాల మద్య ఢిల్లీలో సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో చాల విషయాలు చర్చించ బోతున్నారు. కొన్ని విషయాల మీద సంతకాలు కూడా చెయ్యబోతున్నారు. జరగబోతున్న సమావేశం ఎంతో ప్రాముఖ్యతను అంతరించుకుంది.  ప్రపంచ దేశాలన్ని జరగబోతున్న సమావేశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

దానికి కారణం ఉంది. రెండు దేశాలు క్రాస్ బార్డర్ టెర్రరిజంతో విపరీతంగా బాధ పడుతున్నాయి. నష్ట పోతున్నాయి. ఉగ్రవాదుల చర్య వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పొగోట్టుకంటున్నారు. దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని రెండు దేశాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి.  అందుకే భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. సరిహద్దు చుట్టు గోడ కట్టాలని ప్రపోజల్ పంపింది. అది పాకిస్ధాన్ ఆమోదించింది. దానితో పాటు వాట్ టవర్స్ ఎక్కడ నిర్మించాలో కూడా ఆంగీకారం జరిగి పోయింది. దానికి సంబంధించిన రిపోర్ట్ ను పాకిస్ధాన్ భారత్ కు పంపింది. ఆ రిపోర్ట్ ను అంగీకరించింది భారత్.

ఇక ఖర్చు విషయానికి వస్తే సరిహద్దు చుట్టు గోడ కట్టటానికి దాదాపు వంద కోట్లు అవుతుంది. ఆ ఖర్చుని రెండు దేశాలు సమానంగా పంచుకుంటాయి. దీనికి కూడారెండు దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి. ఈ విషయాలతో పాటు మరి కొన్ని ముఖ్యమైన ఒడంబడికలు ఉన్నాయి. వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటారు.

వచ్చే నెల పాకిస్ధాన్ రక్షణ మంత్రి తన సహచరులతో భారత్ పర్యటించ బోతున్నాడు. ఆ డెలిగేషన్ కు జహీర్ అబ్బాస్ ను చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా రక్షణ మంత్రి నియమించాడు. అయన నిర్ణయం విని చాల మంది సూపీరియర్ అధికారులు నిర్ఘాంత పోయారు. చీఫ్ సెక్యురిటి గా ఉండటం మాములు విషయం కాదు. దానికి ఎంతో అనుభవం కావాలి. తెలివి కావాలి. కాని జహీర్ అబ్బాస్ కు ఏమాత్రం అనుభవం లేదు. పైగా ఇది ఎంతో రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఏమాత్రం తారుమారు అయిన చాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మంత్రికి ఆయన సహచరులకు సెక్యురిటికి సంబంధించిన విషయం. అందుకే రక్షణ మంత్రి నిర్ణయం విని డిఫెన్స్ సెక్రటరి ఆశ్చర్య పోయాడు.
“ఇంకో సారి ఆలోచించండి. జహీర్ అబ్బాస్ గురించి నేను తేలికగా మాట్లాడటం లేదు. అతను ఈ మద్యనే డిపార్ట్ మెంట్లో రిక్రూట్ అయ్యాడు. యువకుడు ఉత్సాహ వంతుడు. వృత్తి పట్ల అంకిత భావం ఉన్నవాడు. అందులో సందేహం లేదు. కాని చీఫ్ సెక్యురిటి ఉద్యోగానికి ఆ లక్షణాలు మాత్రం సరిపోవు.

ఇంకో ముఖ్యమైన లక్షణం కూడా కావాలి.అది  అనుభవం. అబ్బాస్ కు ఇలాంటి విషయాలలో ఎలాంటి అనుభవం లేదు. అతను  ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ గలడా అని అనుమానంగా ఉంది” అన్నాడు డిఫెన్స్ సెక్రటరి.

“మీరు చెప్పింది నిజమే కాదనను. కాని వాటి అన్నిటికి కంటే ఇంకో ముఖ్యమైన లక్షణం కావాలి. అది దేశం మీద విపరీతమైన ప్రేమ. దేశం పట్ల పొసెసివ్ నెస్. ఆది అబ్బాస్ కు మెండుగా ఉంది. అతని పర్సనల్ ఫైలు తెప్పించుకుని చదివాను. అందులో అతని సీనియర్ ఆఫీసర్స్ అతని గురించి చాల గొప్పగా రాశారు. వాటితో పాటు అతని కుటుంబం గురించి కూడా రాశారు. ముఖ్యంగా అతని తండ్రి గురించి రాసిన విషయాలు చాల గొప్పగా ఉన్నాయి. అబ్బాస్ తల్లిని అధికారులు ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఆమె భర్త గురించి కొన్ని విషయాలు చెప్పింది. అబ్బాస్ తండ్రికి తన కొడుకు పెద్ద మిలిట్రి అధికారి కావాలని కోరిక. కొడుకు మిలిట్రిలో చేరి దేశానికి సేవ చెయ్యాలని ఆయన ఎంతో కాంక్షించాడు. కాని దురదృష్టవశాత్తూ ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయాడు. ఆయన భార్య షబ్నమ్ అబ్బాస్ బాధ్యతను తన మీద వేసుకుంది. పది మంది ఇంట్లో పాచి పని చేసి అబ్బాస్ ను చదివించింది. అబ్బాస్ కూడా బాగా చదువుకుని తండ్రి కోరిక తీర్చాడు. ఒక గొప్ప లక్ష్యంతో అబ్బాస్ ఈ ఉద్యోగం సంపాదించాడు. అలాంటి వాళ్ళ దేశం కోసం ఏమైనా చేస్తారు. దేశం కోసం నిజాయితీగా డ్యూటి చేస్తారు. వాటితో పాటు ఇంకా చాల విషయాలు పరిగణనలోకి తీసుకున్నాం. ఆ తరువాత కాని నేను అబ్బాస్ ను సెలక్ట్ చెయ్య లేదు. “

“ఈ రోజే అఫీషియల్ ఆర్డర్స్ జారి చేస్తాను. ఆ ఆర్డర్స్ రాగానే అబ్బాస్ ను ఇండియా పంపించండి. అక్కడ సెక్యురిటి ఏర్పాట్లను గమనించి నాకు రిపోర్ట్ చెయ్యమని చెప్పండి” అన్నాడు మంత్రి.

ఇక తను ఏం చేసినా మంత్రి వినడని డిఫెన్స్ సెక్రటరికి అర్ధమైంది. అదే రోజు అబ్బాస్ ను చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా నియమిస్తూ ఆర్డర్స్ జారి చేశారు.

ఒకపక్క చిగురిస్తున్న ప్రేమ....మరోపక్క దేశరక్షణ లో సరికొత్త కీలకమైన బాధ్యతలు అబ్బాస్ అడుగులెటు....తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురుచూడాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani