Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ramcharan favourite song

ఈ సంచికలో >> సినిమా >>

వృద్ధాప్యం మీద పడని నటులు

Senior Actors looking as young

వృద్ధాప్యం అనేదానికి భిన్నమైన అర్థాలు చెప్పవచ్చు. ఒకటి శారీరక వృద్ధాప్యం, ఇంకోటి మానసిక వృద్ధాప్యం. పాతికేళ్ళలోనూ అరవయ్యేళ్ళ వృద్ధాప్యం ఛాయలు కన్పిస్తాయి మానసిక ఆందోళనల వలన. అదే మానసికంగా ఆనందంగా వుంటే, అరవయ్యేళ్ళేం ఖర్మ, ఎనభైలలోనూ ఇరవైలలో వున్నట్లుగా ఆనందంగా వుండొచ్చు. దానికి సీనియర్‌ నటుడు అక్కినేని నాగేశ్వరరావే నిదర్శనం.

నటుడు, నిర్మాత మురళీమోహన్‌ వయసెంతుంటుందని అనుకుంటున్నారు.? ఆయన వయసు 74. అయినా ఆయన అంత వయసున్నట్టుగా కనిపించరు. ఫిజిక్‌ని బాగా మెయిన్‌టెయిన్‌ చేస్తారు, మహా అయితే 50 వుంటాయేమో.. అనిపిస్తుందంతే ఆయన్ని చూస్తే. మోహన్‌బాబు వయసు 61. ఆయనా సినిమాల్లో హీరోగా నటిస్తే, 40 ప్లస్‌లా వుంటారంతే. ఫిజిక్‌ ఈయనా బాగా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. గిరిబాబు అయితే డెబ్భయ్‌కి దగ్గరలో వున్నా, అంత వయసున్నట్టుగా కనిపించరు.

సినీ పరిశ్రమలో గ్లామర్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం కూడా అందరికీ చెల్లదు. కొందరికి మాత్రమే అది వీలవుతుంది. అలాంటివారిలో మురళీమోహన్‌, గిరిబాబు, మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, వీటికి తోడు తగినంత వ్యాయామం.. అసలు వయసుని తగ్గించి చూపుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam